Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల వ్యవసాయాధికారి కిరణ్కుమార్
పంటల సాగులో మెళకువలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని, విత్తనాలు వేసే ముందు పచ్చిరొట్టె, జీలుగ వంటి ఎరువు లను పొలంలో వేసి కలియ దున్నాలని, రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచాలని, తద్వారా నాణ్యమైన పంట చేతికొస్తుందని, రసాయనిక ఎరువులు వాడడడం వల్ల భూమి కాలుష్యమౌతుందని మండల వ్యవసాయాధికారి కిరణ్కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన 'నవతెలంగాణ'తో పలు విషయాలు పంచుకున్నారు.
నవతెలంగాణ - హన్వాడ
నవతెలంగాణ : మండల భౌగోళిక విస్తీర్ణం ఎంత ?
వ్యవసాయాధికారి : మండల భౌగోళిక విస్తీర్ణం 56 వేల ఎకరాలు.
నవతెలంగాణ : మండలంలో సాగుకు పనికొచ్చే భూమి ఎంత ?
వ్యవసాయాధికారి : మండలంలో సాగుకు పనికొచ్చే భూమి 38 వేల ఎకరాలు.
నవతెలంగాణ : ప్రతి ఏటా రైతులు ఎంత సాగు చేస్తున్నారు ?
వ్యవసాయాధికారి : సుమారు 20 వేల ఎకరాల వరకు సాగు చేస్తున్నారు.
నవతెలంగాణ : ప్రస్తుతం మెట్ట పంటలు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు ?
వ్యవసాయాధికారి : సుమారు 8 వేల ఎకరాలలో మెట్ట పంటలు సాగు చేశారు.
నవతెలంగాణ : పచ్చ జొన్న సాగు తగ్గడానికి కారణాంలేటి ?
వ్యవసాయాధికారి : వర్షాలు సకాలంలో పడడంలేదు. మండలంలో చాలా తక్కువగా సాగు చేశారు.
నవతెలంగాణ : మొక్కజొన్న పంటలకు తెగుళ్లు ఏమైనా వస్తాయా ?
వ్యవసాయాధికారి : వర్షాలు ఎక్కువ పడడం వల్ల పొలాలు తడి మీద ఉన్నాయి. కత్తెర పురుగు వచ్చే అవకాశాలున్నా యి. రైతులు ఎప్పటికప్పుడు పంటలను గమనిస్తూ ఉం డాలి.
నవతెలంగాణ : కత్తెర పురుగు నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ?
వ్యవసాయాధికారి : ప్రాథమిక దశలో గుర్తించి వేప నూనె ను పిచికారి చేయాలి.
నవతెలంగాణ : రైతులకు సబ్సిడీ యంత్రాలు, ఇతర వ్యవసాయ పనిముట్లు అందిస్తున్నారా ?
వ్యవసాయాధికారి : ప్రస్తుతం ప్రభుత్వం నుంచి సబ్సిడీ వ్యవసాయ పనిముట్లు ఏవీ ఇవ్వడంలేదు.
నవతెలంగాణ : రైతుబీమా ఈ నెల చివరి వరకు ఉంది కదా రైతులకు అవగాహన కల్పించారా ?
వ్యవసాయాధికారి : క్లస్టర్ గ్రామాలలో ఏఈవోలు అన్ని గ్రామ పంచాయతీల వద్ద బీమా చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
నవతెలంగాణ : పీఎం కిసాన్ పథకంపై రైతులకు సూచనలు చేశారా ?
వ్యవసాయాధికారి : ఈ నెల చివరి వరకు సీఎం కిసాన్ పథకంలో రైతులు ఈ-కేవైసీ చేసుకోవాలి.
నవతెలంగాణ : రైతులకు మీరిచ్చే సూచనలు, సలహాలేంటి ?
వ్యవసాయాధికారి : పంటల సాగును రైతులు ఎప్పటికప్పు డు గమనిస్తూ ఉండాలి. అవసరమైతే ఏఈఓలను గానీ, తమను గానీ సంప్రదించి సలహాలు తీసుకొని మందులు వేసుకోవాలి.