Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కందనూలు
పెరిగిన ధరలకు అనుగుణంగా మిస్ చార్జీలు రోజుకు 150 రూపాయలు పెంచాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తారాసింగ్ అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలో బీసీ బాలికల కళాశాల హాస్టల్ ను ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సర్వే చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత భవనం లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, నాసిరకమైనటువంటి భోజనం విద్యార్థులకు పెడుతున్నారని ఆరోపించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ లకు మెస్ చార్జీలు ఒక విద్యార్థికి రోజుకు 49 రూపాయలు మాత్రమే అందిస్తుదంన్నారు కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా మిస్ చార్జీలు రోజుకు 150 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. తక్షణమే కొత్త మినును రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రవి, శ్రీలత పాల్గొన్నారు.