Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొసాగుతున్న వీఆర్ఏల నిరసన
- సీఐటీయూ నాయకులు
- వంటావార్పుతో నిరసనలు
- మూతికి నల్ల బట్ట కట్టుకొని నిరసన
- వివిధ పార్టీ నాయకుల మద్దతు
వనపర్తి : గ్రామ రెవెన్యూ సహాయకుల కు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని వీఆర్ఏల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పుట్ట ఆంజనేయులు డిమాండ్ చేశారు. వీఆర్ఏల నిరవధిక సమ్మె ఐదవ రోజుకు చేరింది. బుధవారం నిరసనలో భాగంగా వీఆర్ఏలు మూతికి నల్ల గుడ్డ కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. వీఆర్ఏలకు పేస్కెల్ ఇస్తానని, ప్రమోషన్లు ఇస్తానని ,డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని మరిచారు. 2020 సెప్టెంబర్ 9న నిండు అసెంబ్లీలో వీఆర్ ఏలకు పేస్కేలు తరహా వేతనాలు ఇస్తానని, ప్రమోషన్ ఇస్తానని, 55 ఏళ్ళు పైబడిన వారి పిల్లలకు వారసులకు ఉద్యోగాలు ఇస్తానని, డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని నిండు అసెంబ్లీలో ప్రకటించారన్నారు. రెండేళ్లయినా హామీల అమలు అతీగతి లేదన్నారు. కావున తెలంగాణ వీఆర్ ఏలు జేఏసీగా ఏర్పడి నిరవధిక సమ్మె చేస్తున్నా రన్నారు. ఈ సమ్మె న్యాయస మ్మతమైందన్నారు కావున ఈ సమయంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నా మన్నారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రామ రెవెన్యూ నాయకుల సంఘం జేఏసీ నాయకులు సురేష్ రమేష్, భాగ్యలక్ష్మి ,నాగమణి పాల్గొన్నారు.
నారాయణపేట టౌన్: దామరగిద్ద మండల కేంద్రంలో వీఆర్ఏలు చేస్తున్న సమ్మెకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి వెంకటరామరెడ్డి, సీఐటీయూ మండల కార్యదర్శి జోషి కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి వెంకట రామరెడ్డి, దామరగిద్ద మాజీ సర్పంచ్ శరన్ నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను అమలు చేయాలని అన్నారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలుపరిచే వరకు సమ్మె కొనసాగుతుందని అన్నారు. వీఆర్ఏలు ప్రభుత్వం యొక్క చిన్న చితక పని నుండి ఏదైనా ప్రజలకు చేరవేసే వారని అన్నారు. నారాయ ణపేట జిల్లా వ్యాప్తంగా వీఆర్ఏలు 558 మంది సమ్మెలో ఉన్నారని అన్నారు. ప్రస్తుతం ఇచ్చే జీతాలు ప్రస్తుత కాలానుగుణంగా సరిపోవడం లేదని అన్నారు. వీఆర్ఏలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ శరన్ నాయక్ ,కాంగ్రెస్ నాయకులు వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట టౌన్ : పే స్కేల్ వచ్చేవరకు సమ్మె కొనసాగుతుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం అన్నారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాల యం ముందు వీఆర్ఏలు కొనసాగిస్తున్న సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ సహాయకులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు. పే స్కేల్ వచ్చేవరకు సమ్మె కొనసాగుతుందన్నారు.
జడ్చర్ల : న్యాయమైన డిమాండ్లు నెరవేరెవరకు ప్రభు త్వం పై పోరాడుతామని వీఆర్ఏ జెఏసీ అధ్యక్షుడు ఆంజ నేయులు అన్నారు. వీఆర్ఏ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. వీఆర్ఏల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎర్ర శేఖర్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో వీఆర్ఏ సంఘం నాయకులు అంజనరెడ్డి, నాగరాజు,సతీష్, శ్రీనివాసులు, భారతి, అంజలి, సరస్వతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నిత్యానందం, కరాటే శ్రీను, సర్ఫరాజ్, శాగంటి రఘు, పాల్గొన్నారు.
పెద్దకొత్తపల్లి : మండలాలలోని వీఆర్ఏలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, అసెంబ్లీ సాక్షిగా నీవు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని కోరుతున్నారని ఆయన అన్నారు. శుక్రవారం ఐదవ రోజుక చేరుకున్న సమ్మె శిబరం వద్దకు సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు ,వీఆర్ఏ జేఏసీ జిల్లా చైర్మన్ విజరు, కో కన్వీనర్ అశోకులు వెళ్లి సంఘీభావాన్ని తెలిపారు.
తెలకపల్లి : వీఆర్ఏల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ వీఆర్ఏల రాష్ట్ర జాక్ పిలుపు మేరకు శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏ లు నోటికి నల్ల బట్టలు కట్టుకుని నిరవధిక సమ్మె నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం జిల్లా చైర్మన్ ఆర్ విజరు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో మండల జాక్ చైర్మన్ కె అశోక్ ,కో చైర్మన్ ఇబ్రహీం సెక్రటరీ జనరల్ టి.రాము, సోషల్ మీడియా కన్వీనర్ సాయి,కో కన్వీనర్లు కె బాలమ్మ, సైదులు సుల్తాన్ వీఆర్ఏ లు పాల్గొన్నారు.
పెద్దకొత్తపల్లి : వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కొల్లాపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిలాషరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేస్తున్న సమ్మెలో శుక్రవారం పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు మాట ఇచ్చడం తప్పడం కుత్తేమీ కాదని తెలిపారు.ఇప్పటికైనా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, డబల్ బెడ్ రూములు ,మూడెకరాల భూ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు హుస్సేన్,బాబా, క్రాంతి కుమార్ ,రఫీ, కంటే శివన్న ,అశోక్ ,నంద, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్ : వీఆర్ఏల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని వీఆర్ఏలు బాలస్వామి శ్రీనివాసులు అన్నారు. మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏ సంఘం ఆధ్వర్యంలో నిరసనలు చేశారు. ఐదవ రోజు సమ్మెలో భాగంగా వంట వార్పేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో వీఆర్ఏలు శివకుమార్ బాలమ్మ కల్పన ,వీఆర్ఏలు పాల్గొన్నారు
అమరచింత: గత ఐదు రోజులుగా వీఆర్వోలు అమరచింత మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నిరాహార దీక్షలు చేశారు. జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం మూతికి నల్ల బట్టతో నిరసన తెలపారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా సీపీఐ ఎంఎల్ ప్రజా పంతా నాయకులు మండల కార్యదర్శి సి రాజు, పట్టణ కార్యదర్శి రాజన్న , మండల నాయకులు సామెల్, ప్రేమ రత్నం, కురు మన్న ,భక్త రాజ్ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో వీఆర్ఏ మండలాధ్యక్షులు నందిమల్ల మహమూద్, ఉపాధ్యక్షులు ముని స్వామి, జనరల్ సెక్రెటరీ కుమార్, కన్వీనర్ నారాయణ, కోకన్వీనర్ శ్రీనివాసులు, పాల్గొన్నారు.
ధరూర్ : గ్రామ రెవెన్యూ సహాయకుల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు జిల్లాలో ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ సహాయకులు నోటికి నల్ల రిబ్బన్ ధరించి నిరసన తెలపాలని రాష్ట్ర కమిటీ నిర్ణయి ంచింది. దీనిలో భాగంగా జెఎసి అధ్యక్షులు బి రాములు ఆధ్వర్యంలో నిరసన తెలపారు.కార్యక్రమంలో గద్వాల మండల అధ్యక్షులు కావాలి మహేష్ , మండల ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ ఎం వెంకటేశ్వర్లు శ్రీనివాసులు ఉప్పు రాములు వెంకటేష్ సుధాకర్ దేవమ్మ బజార్, అమ్మ, వీఆర్ఏలు పాల్గొన్నారు
ఆత్మకూరు : పట్టణంలో గల నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న వీఆర్ఏల దీక్ష ఐదో రోజు కొనసాగింది. ఇట్టి కార్యక్రమానికి గ్రామ రెవెన్యూ అధికారుల రాష్ట్ర ప్రచార కార్యదర్శి బచ్చలకూర పరమేష్, మండల అధ్యక్షులు కష్ణయ్య, దీక్ష శిబిరానికి వచ్చి మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు గోవిందు, ఉపాధ్యక్షులు గట్టన్న,ప్రధాన కార్యదర్శి నాగేంద్రం, మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు, రంగన్న ,పరుశురాం,లక్ష్మి, రాధమ్మ పాల్గొన్నారు
అచ్చంపేట రూరల్ : అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలాని వారికి 25 వేల రూపాయల పేస్కేలు జీ.ఓను వెంటనే అమలు పరుచాలని టీడీపీ అచ్చంపేట నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ మోపతయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం అచ్చంపేట పట్టణములోని తహశీల్దార్ కార్యాలయంలో 5వ రోజుకు చేరుకున్న వీఆర్ఎ జేఎసి సమ్మే స్థలానికి చేరుకున్న ఆయన వారికి సంఘీభావం తెలిపారు.కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు వెంకటరమణ ,వీఆర్ఏ జేఏసీ చైర్మన్ పరమేష్ కో చైర్మన్ శోభారాణి వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి సాజిత్, ప్రచార కార్యదర్శి రాంగోపాల్, మరియు శాంతయ్య ,కోశాధికారి నిరంజన్,అనిత బుద్ధుల అంజి పాల్గొన్నారు.
ధన్వాడ : వీఆర్ఏ లకు నిరా వేదిక సమ్మె కు సీఐటీయూ జిల్లా నాయకులు ఎం కృష్ణ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ ప్రజా పంతపార్టీ జిల్లా నాయకులు ఏ సలీం, పాతపల్లి సర్పంచి కృష్ణయ్య, రామా ంజనేయులు, నరసింహులు, వీఆర్ఏలు పాల్గొన్నారు.
ఊరుకొండ :ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వీఆర్ఏలు తెలిపారు. శుక్రవారం ఊరుకొండ మండల వీఆర్ఏలు మూతులకు నల్ల బ్యాడ్జీలు ధరించి వినూత్న రీతిలో నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం ఐదవ రోజు వీఆర్ఏల నిరసన దీక్షకు తహాసిల్దార్ జాకీర్ అలీ మద్ధతు తెలిపారు.కార్యక్రమంలో ఊరుకొండ మండల వీఆర్ఏలు సత్తయ్య, రమేష్, శేఖర్, నిరంజన్, శ్రీలత, యాదమ్మ, సుల్తాన్, యాదయ్య, దశరతం, పాల్గొన్నారు.
మరికల్ : మరికల్ మండల కార్యాలయము నందు వీఆర్ఏల శుక్రవారం నిరాహారదీక్ష ఐదవ రోజుకు చేరు కున్నది. కార్యాక్రమంలో వీఆర్ఏ సంఘం నాయకులు కురుమన్న,శ్రీనివాసులు, కురు మన్న, కష్ణయ్య ,శంకర్ ,రమేష్, జానకమ్మ, నాగమణి ,అను సూయ, వీఆర్ఏల సభ్యులు పాల్గొన్నారు.
పెద్దకొత్తపల్లి :మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు గత నాలుగు రోజులుగా మండల వీఆర్ఏలు చేస్తున్న దీక్ష ఐదవవ రోజుకు చేరింది. శుక్రవారం మండల వీఆర్ఏలు వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల జేఏసీ మండల చైర్మన్ మల్లేష్ నాయుడు కొకన్వీనర్ జి రాములు, జనరల్ సెక్రటరీ ప్రసన్న, మండల కన్వీనర్ రమేష్, కో కన్వీనర్ బంగారయ్య, లలిత, వీఆర్ఏలు, శివతేజ, చిన్న నరసింహ, ప్రశాంత్, చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.
బల్మూరు : మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏల నిరసన కార్యక్రమం ఐదు రోజుల్లో భాగంగా శనివారం కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ వీఆర్ఏల సమస్య లు పరిష్కారం అయ్యే వరకు తమ నిరసన కార్యక్రమాలు కొనసా గిస్తామని తెలి పారు. కార్యక్రమంలోఆయా గ్రామాల, వీఆర్ఏలు ఉన్నారు.
ఊట్కూర్ : వీఆర్ఏల సమస్యలు ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన ఉట్కూరులోని తహసిల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మెకు సీఐటీయూ మండల కన్వీనర్ నారాయణ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నర్సింలు, విగేశ్వర్ రెడ్డి ,లింగం, జలాల్ ,కాంగ్రెస్ వీఆర్ఏలు పాల్గొన్నారు.
బిజినాపల్లి : వీఆర్ఏ సమస్యల పట్ల ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పొదిల రామయ్య అన్నారు. శుక్రవారం బిజినేపల్లి మండల ఎమ్మార్వో కార్యాలయం ముందు నిర్వహించిన వీఆర్ఏ జేఏసీ ఐదవ రోజు సమ్మెను మద్దతు తెలిపారు. కార్యక్రమంలో కేవీపీఎస్ మండల కార్యదర్శి సూర్య పాక, హనుమంతు, సుబాకర్, వీఆర్ఏ జేఏసీ మండల అధ్యక్షులు సలేశ్వరం ఉపాధ్యక్షులు హుస్సేన్, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, సలహాదారులు శేఖర్, సాయి, లక్ష్మి,వసంత అనురాధ, చిన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాజిపేట : వీఆర్ఏలకు పే స్కేల్ జీవో వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జి అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో వీఆర్ఏలు పే స్కేల్ జీవో సాధన కొరకు నాలుగు రోజులుగా రిలే నిరాహార చేపట్టారు. వీరికి సీఐటీయూ సభ్యులు జి.అశోక్ పాల్గొని సంఘీ భావం తెలిపారు.కార్యక్రమంలో విఆర్ఏ లు దామో దర్ యాదగిరి ఉదరు నవనీత రాజు రమేష్ వెంకటయ్య లక్ష్మమ్మ బాలస్వామి ఉన్నారు.
అచ్చంపేట : రెవిన్యూ శాఖలో పని చేస్తున్న వీఆర్ ఏలు సమస్యలు పరిష్కారించాలని టీడీపీ అచ్చంపేట ఇన్ చార్జ్ డాక్టర్ మెపతయ్య డిమాండ్ చేశారు. అచ్చంపేట మండలం తహశీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు గత సమ్మె 5 వ రోజుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. శుక్రవారం మెపతయ్య వారికి సంపూర్ణ మద్దతు ప్రకటి ంచారు.5.రోజు మూతికి నల్ల రిబ్బన్లు కట్టుకొని మౌన ప్రదక్షిణ చేస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ పరమేష్, కో చైర్మన్ శోభారాణి, వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి సాజిత్,ప్రచార కార్యదర్శి రాంగోపాల్,శాంతయ్య ,కోశా ధికారి నిరంజన్ సభ్యులు రాములు,చిట్టయ్య ,నిరంజన్ తవిటి ఆంజనేయులు, వెంకటేష్చాంద్ బి ,హనుమంతు, మహేష్, శ్రీను ,కవిత, ఉమా, అనిత బుద్ధుల అంజి పాల్గొన్నారు.
అయిజ : అయిజ మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన వీఆర్ఏ జెఏసీ నిరవదిక సమ్మేకు సీపీఐ ఎం ఎల్ ప్రజా పంథా జిల్లా నాయకుడు హలీం పాషా, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి హరీష్ సంఘీభావం తెలిపారు.
మహమ్మదాబాద్ : రెవెన్యూ శాఖలో లోకల్‌గా పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎత్తు 5వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో దీక్ష చేశారు. మండల వీఆర్ఏల అధ్యక్షులు గంగాధర్ మాట్లాడుతూ. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల మంది వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తానని చేప్పారని గుర్తుచేశారు.ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల మండల కార్యదర్శి హర్షవర్ధన్, మారుతి, వెంకటేష్,నీరటి కనకయ్య, అనిత, పద్మమ్మ, బాలకిష్టమ్మ పాల్గొన్నారు.
కందనూలు : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో వీఆర్ఏ లు తమ సమస్యలు పరిష్కరించాలని గత కొద్దీ రోజులుగా ధర్నా చేస్తున్నారు వారి ధర్నాకు మద్దతుగా శుక్రవారం బీఎంఎస్ జిల్లా కన్వినర్ మలిశెట్టి చంద్రశేఖర్ పాల్గొని మద్దతు తెలిపారు. కార్యక్రమంలో నాగర్ కర్నూల్ మండల వీఆర్ఏజాక్ అధ్యక్షులు శ్రీను, నాగయ్య,నిరంజన్, రాఘవేందర్. బీఎంఎస్ నాయకులు సుధాకర్, ప్రవీణ్, సైదులు,బాలస్వామి,దినేష్,వెంకటేష్ పాల్గొన్నారు
పెంట్ల వెళ్లి : మండల హక్కులుసాధించే వరకు వీఆర్ఏ ల సమ్మె కు మద్దతు గా ఉంటామని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ హనుమంతు అన్నారు. ఈ సందర్భంగా ఆయన సమ్మె లో పాల్గొని ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వీఆర్ఏలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు ఆంజనేయులు, వీఆర్ఏల సంఘం నాయకులు స్వాములు,రమేష్, కోటేశ్వరమ్మ, రామస్వామి,వెంకటయ్య, వెంకటమ్మ, లక్ష్మమ్మ, లావణ్య, కల్పన, రాములమ్మ, కురుమయ్య, చక్రవర్తి, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ధరూర్ : వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేస్తామని, అర్హులైన వారందరికీ పదోన్నతి కల్పిస్తామని హమినిచ్చారని వీఆర్ఏలు తెలిపారు. ధరూర్ మండల కేంద్రంలో తాహసిల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏల 5వ రోజు నిరవధిక సమ్మెకు సంఘీభావం ప్రకటిస్తూ నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా ఛైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ మాట్లాడారు. గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ అన్ని శాఖల దగ్గర వెట్టిచాకిరి చేస్తున్నటువంటి వీఆర్ఏలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు మల్దకల్ మండలం కార్యదర్శి ఉలిగేపల్లి తిమ్మప్ప, రంగస్వామి, ధరూర్ మండల సమన్వయకర్త పరుశరాముడు, కుమ్మరి రమేష్, ఆశన్న తదితరులు పాల్గొన్నారు.