Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవతెలంగాణ కథనంకి స్పందన
నవతెలంగాణ - అయిజ
అయిజ మండల కేంద్రంలోని కొత్తబస్టాండ్ సమీపంలోని భరత్ నగర్ కాలనీ ప్రధాన రహదారి సీసీ రోడ్డు పనులు రెండు నెలల నుంచి అరకొర పనులతో పెండింగ్ పెడుతూ ప్రయాణికులను, కాలనీ వాసులను ఇబ్బందిగా మారడంతో మరి అదే విధంగా 17వ వార్డులో బ్రైట్ స్టార్ స్కూల్ పక్కన మురుగు నీరు చేరి మడుగులా మారిందని దీని వలన ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని నవతెలంగాణ పత్రిక కథనం ప్రచురితమైంది దీంతో ఈ సమస్యల పై తొందరగా ప్రజా ప్రతి నిధులు అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేసి మాడుగుల ఆగిన మురుగు నీరును జేసీబీ ద్వారా పక్కకు మళ్ళించి బ్లీచింగ్ పౌడర్ చల్లారు.