Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్ ఫ్లో 19 వేల క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో 11,120 క్యూసెక్కులు
- పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు
- ప్రస్తుతం 4.052 టీఎంసీలు
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వరప్రదా యిని అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. ఎగువన నారాయణపూర్ నుంచి 14 వేల క్యూసెక్కులు, ఆల్మట్టి నుంచి 12 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో జూరాలకు 19 వేల క్యూసె క్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీ ఎంసీలు కాగా ప్రస్తుతం 4.052 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 7,347 క్యూసెక్కుల నీటిని ఉపయోగించి ఒక యూనిట్లో 39 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు. యథావిధిగా జూరాల నుంచి నెట్టెంపాడుకు 1500 క్యూసెక్కులు, భీమా-1కు 0, భీమా-2కు 0 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 920 క్యూ సెక్కులు, కుడి కాల్వకు 437 క్యూసెక్కులు, కోయిల్సా గర్కు-0 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 850 క్యూసె క్కుల నీరు విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతానికి 11,120 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.