Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలమూరు-రంగారెడ్డిలో మృత్యు ఘంటికలు
- పని ప్రదేశంలో ఐదుగురు మృతి
- ఇప్పటి వరకు 50 మంది మృతి చెందిన వైనం
- పని ప్రదేశాల్లో చేపట్టని రక్షణ చర్యలు
- ఇతర రాష్ట్రాల కార్మికులు కావడంతో కంపెనీ నిర్లక్ష్యం
- దృష్టి సారించని పాలకులు
- దిక్కుతోచనిస్థితిలో కార్మికులు
మహబూబ్‌నగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, అదనంగా వికారాబాద్ జిల్లాలకు సాగు, తాగునీరందించేందుకు రూ.50 వేల కోట్లతో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కార్మికుల పాలిట యమపాశంగా మారింది. పాలకులు, కంపెనీల నిర్లక్ష్యం, అధికా రుల పర్యవేక్షణా లోపం వెరసి ప్రాజెక్టు పనుల్లో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 50 మంది కార్మికులకు పైగా మృతి చెందారు. తాజాగా గురువారం అర్ధరాత్రి ఐదుగురు ప్రమాదంలో మృతి చెందారు. వీరంతా జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో కంపెనీ యజమాన్యాన్ని, అధికారులను అడిగే దిక్కే లేకుండాపోయింది. వీరి మరణంతో ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఇంత ఘోరం చోటు చేసుకున్నా గుట్టు చప్పుడు కాకుండా పోలీసుల సాయంతో హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించడంపై ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం లోని ఎల్లూరు దగ్గర ఐదేండ్లుగా పాలమూరు-రంగారెడ్డి పనులు కొనసాగుతున్నాయి. 17 ప్యాకేజీలుగా చేపట్టిన ఈ నిర్మాణ పనుల్లో ఇప్పటికే 50 మంది వరకు మృతి చెందా రు. అందులో అధిక శాతం బీహార్, జార్ఖండ్, గుజరాత్ రా ష్ట్రాలకు చెందిన కార్మికులున్నారు. టన్నెల్, సంప్, సర్జిఫుల్ పనుల్లో 2 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. అందు లో గురువారం అర్ధరాత్రి కాంక్రీట్ తీసుకెళ్తున్న క్రేన్‌వైర్ తెగి సర్జిపుల్ పని చేస్తున్న కూలీలపై పడింది. ఈ ప్రమాదంలో సూప ర్వైజర్ ఆంద్రప్రదేశ్‌కు చెందిన శ్రీనువాసులు (35), జార్ఖాండ్‌కు చెందిన కమలేష్ (25), జార్ఖాండ్‌కు చెందిన ప్రవీణ్ (19) బీహార్‌కు చెందిన బోలోనాథ్ యాదవ్ (55) గుజరాత్‌కు చెందిన సోను (19)లు మృతి చెందారు. ప్ర మాదం చోటు చేసుకోగానే ఎవరికీ తెలియ కముందే ఐదు మృతదేహాలను వైద్యం ముసుగులో హైదరాబాద్‌కు తరలి ంచి అక్కడ మృతి చెందినట్లుగా చిత్రీకరించారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎవరూ బయటకు వెళ్లకుండా, బయటి వారు లోపలికి రాకుండా బారీకేడ్లు ఏర్పాటు చేసి వచ్చిన ఆయా పార్టీల నేతలు, మీడి యాను నిలువరిస్తున్నారు.
ప్రమాదాలు అనేకం
పాలమూరు-రంగారెడ్డితో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో అనేక మంది మృతి చెందారు. ప్రజా సంఘాల వివరాల ప్రకారం రెండు ప్రాజెక్లుల్లో సుమారు 100 మం దికి పైగానే ఛనిపోయారు. టన్నెల్ కూలి, కాల్వల్లో పడి, నీటిముంపునకు గురై షాట్‌సర్క్యూట్‌తో పాటు వాహనాలు ఢకొీని మరణించినవారున్నారు. ప్రమాదాలు చోటు చేసుకు న్న సమయంలో కంపెనీలు వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్య కరంగా ఉంటోంది. పశువుల మాదిరిగా తరలించి చేతులు దులుపుకుంటున్నారు. కనీసం బాధిత కుటుంబ సభ్యులకు ఏమా త్రం పరిహారం ఇవ్వడం లేదు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తూ కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కంపె నీపై చర్యలు తీసుకో వాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
బాధితులకు పరామర్శ
కోడేరు : ప్రమాద ఘటనలో మృతి చెందిన ప్రమాద బాధితులను ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు టీఆర్ఎస్ నాయకులు దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి హైదరాబాదులోని ఉస్మానియా ఆస్పత్రిలో పరామర్శించారు.
హైకోర్టు దష్టికి తీసుకెళ్తాం
- కార్మిక శాఖ జాతీయ చైర్మన్ శ్రీనివాస్ నాయుడు
కొల్లాపూర్ : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రభుత్వ అనుమతుల్లేకుండా కార్మికులతో పని చేయిస్తున్నారని కా ర్మిక శాఖ జాతీయ చైర్మన్ శ్రీనివాస్ నాయుడు అన్నారు. శుక్రవారం ప్రమాద ఘటన ప్రాంతాన్ని పరిశీలించేందు కు రాగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉన్న తాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో లోపలికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులు, కార్మికులు, ప్రమాద ప్రాం తాలను పరిశీలించారు. ఘటనకు గల కారణాలను అడి గి తెలుసుకున్నారు. మేఘా కంపెనీ సభ్యులతో చర్చిం చారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ప్రాజె క్టు పనులపై గతంలో ఫిర్యాదులు అందాయన్నారు. దీం తో జూన్ 10న వచ్చి పరిశీలించినట్లు చెప్పారు. లేబర్ యాక్ట్ ప్రకారం నోటీసులు పంపించినా పట్టించుకోలేద న్నారు. నేడు ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం బాధాకర మని, ఈ ఘటనపై హైకోర్టుకు వెళతామని తెలిపారు.
'రూ.50 లక్షల పరిహారమివ్వాలి'
కందనూలు : ప్రమాదంలో మృతి చెందిన ఒక్కో కార్మికు డికి రూ.50 లక్షల చొప్పున పరిహారమివ్వాలని, ప్రమా దాలు చోటు చేసుకుంటున్నా పట్టీపట్టనట్లు వ్యవహరి స్తున్న కంపెనీ లైసెన్స్ రద్దు చేయాలి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్ డిమాండ్ చేశా రు. స్థానిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మృతి చెందిన కార్మి కులను కొల్లాపూర్ గానీ, నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రులకు తరలించకుండా ఉస్మానియాకు తరలించి ఘటనను గోప్యంగా ఉంచేందుకు కంపెనీ ప్రయత్నించడం, అందుకు ప్రభుత్వం సహకరించడం పై మండిపడ్డారు. కార్మికుల కుటుంబాలను కలిసేం దుకు వెళ్లిన వామపక్ష నాయకులను అడ్డుకోవడం అప్ర జాస్వామికమన్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే, మంత్రి స్పందించాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్, ఉపాధ్యక్షులు చెన్నా దాస్, కోశాధికారి శ్యాం, జిల్లా నాయకులు దేవయ్య, యాద య్య, శ్రీనివాస్, నాగరాజు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) నాయకుల అడ్డగింత
కొల్లాపూర్ రూరల్ : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో గురువారం అర్ధరాత్రి ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు బృందం తో ప్రమాద ఘటనకు వెళ్లారు. అయితే అక్కడ ప్రాజెక్టులోకి వెళ్లకుండా పోలీసు లు భారీ కేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డు కుని స్టేషన్‌కు తరలించారు. ఈ సంద ర్భ ంగా వర్ధం పర్వతాలు మాట్లాడుతూ ప్రమాద ఘటనపై హైకోర్టు న్యాయమూ ర్తితో విచారణ చేయించాలన్నారు. ఐదు గురు మరణిస్తే సందర్శించడానికి మం త్రులకు సమయం దొరకడం లేదా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు, అక్కడి పరిస్థితులపై ఆరా తీసేందుకు వెళ్తే మేఘా కంపెనీని రక్షించేందుకు పోలీసులను ఉపయోగించి తమను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ఇలాంటి ఘటన లు చోటు చేసుకు ంటున్నా కార్మిక శాఖ అధికారులు నిద్రావస్థను వీడడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఒక్కో కార్మికుడికి రూ.కోటి చొప్పున పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.శ్రీనివాస్, నాయకులు నరసింహ, బి.శివవర్మ, ఈశ్వర్, శ్రీనివాస్, భాస్కర్, అశోక్, దశర థం, కృష్ణయ్య, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.
రూ.40 లక్షలు చెల్లించాలి : మాజీ మంత్రి జూపల్లి
కొల్లాపూర్ : పాలమూరు-రంగారెడ్డి ప్రమాద బాధితులకు రూ.40 లక్షల చొప్పున పరిహారం అందించాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించి మాట్లాడారు. కంపెనీ యజమాన్యంతో మాట్లాడి ప్రమాద ఘటనకు బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలన్నారు. గతంలో ఇక్కడ పని చేసిన కంపె నీ అదేస్థాయిలో చెల్లించారని గుర్తు చేశారు. అయి తే కంపెనీ యాజమాన్యం మతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.40 లక్షల చొప్పున చెల్లించేందుకు అంగీకరించి నట్లు చెప్పారు. బాధితుల పక్షాన ఎల్లప్పుడు అండగా ఉంటామని, ఇలాంటి ప్రమాద ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యతను యాజమాన్యాలు, అధికా రులపై ఉందని తెలిపారు.