Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- మహబూబ్ నగర్
వర్షాలు కురిసి వెలసిన వేళ ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు ప్రజలను కోరారు. శుక్రవారం మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో శేషాబ్ గుట్టలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ లో పాల్గొని తనిఖీలు నిర్వహించారు. ఇల్లు తిరుగుతూ ప్రజల నుండి అభిప్రాయాలు తీసుకున్నారు . పారిశుద్ధ్య కార్మికులు వస్తున్నారా.. డ్రైనేజీలను ప్రతిరోజు శుభ్రం చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు . ప్రజలందరూ ఎవరికి వారు వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటించాలని అప్పుడే సీజన్ వ్యాధులను దూరం చేస్తామన్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. మీరు మీ కాలనీలో మీ తల్లిదండ్రులతో అందరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రత కాలనీ పరిశుభ్రతగా ఉంచుకునేందుకు చెప్పాలని విద్యార్థులకు సూచించారు. కలెక్టర్ వెంట కౌన్సిలర్ కృష్ణ మోహన్, ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.