Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ పి.ఉదరుకుమార్
నవతెలంగాణ - కందనూలు
వాతావరణ మార్పులకు అనుగుణంగా పం టల ఎంపిక, సమగ్ర వ్యవసాయ విధానాలతో పాటు ఆధు నిక సాంకేతికతను అందిపుచ్చు కుంటే అధిక లాభాలు సాధించవచ్చని జిల్లా కలెక్టర్ పి.ఉదరుకుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 75 సంవత్స రాల అమత్ మహోత్సవంలో భాగంగా నాబార్డు ఆవిర్భవి ంచి 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ఎన్జీవోలు, బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. రైతులు ఒకే పంట వేసే విధానా నికి స్వస్తి పలికి రెండు, మూడు రకాల పంటలు, కూరగా యల పెంపకంతో పాటు, వ్యవసాయ అనుబంధ మార్కెట్ డిమాండ్ ఆదాయాలపై దష్టి సారించాలన్నారు. సేంద్రీయ సాగుతో నేలలను తిరిగి సారవంతం చేసేలా రైతులకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అవగాహన కల్పించాలన్నా రు. బ్యాంకులు రుణాలు మాత్రమే అందిస్తాయని, బ్యాం కులందించే రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారా ల్లో అధిక లాభాలు గడించాలన్నారు. మహిళా సంఘాలు బ్యాంకు రుణాలను ఉపయోగించుకుని వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నారు. దళిత బంధు ద్వారా ఎంపికైన లబ్ధిదారులు ఎంచుకున్న వ్యాపారాల్లో అధిక లాభాలు గడించేలా అవగా హన కల్పించాలన్నారు. నాబార్డు అందించిన రుణాల గురి ంచి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి, నాబార్డు అధికారి షణ్ముఖ చారి, లీడ్ బ్యాంకు మేనేజర్ కౌన్సిల్ కిషోర్ పాండే, డీఆర్డీఓ నర్సిం గరావు, జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు, వనపర్తి లీడ్ బ్యాంక్ మేనేజర్ ఏవీన్ పవర్, డీపీఎం అరుణా దేవి, ఏపీడీ శ్రీనివాస్, ఆయా బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.