Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వనపర్తి టౌన్
అక్రమ వెంచర్లను స్వాధీనం చేసుకోవాలని అఖిలపక్ష ఐక్యవేదిక సభ్యులు అన్నారు. జిల్లాలో అక్రమంగా నిర్మిస్తున్న సేల్లర్లపై అక్రమ వెంచర్ల పై జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా ఏర్పడిన తర్వాత మున్సిపాలిటీ అధికారులుఅక్రమ కట్టడాలు బహుళ అంతస్తులు తెలంగాణ గవర్నమెంట్ తెచ్చిన జీవో ప్రకారం నిర్మించాలన్నారు. కానీ వనపర్తి పట్టణానికి సంబంధించి ఇష్టానుసారంగా సెల్లోర్లతో నిర్మిస్తూ, పార్కింగ్ సౌకర్యం లేకుండా రోడ్డుపైకి నిర్మిస్తున్నారని తెలిపారు. అలాగే వనపర్తి పట్ట ణానికి చుట్టుపక్కల ఉన్న వెంచర్లు చాలావరకు అక్రమంగా వేస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగు తున్నా అధికారులు ఏ మాత్రం పట్టించు కోవడం లేదని, తక్షణమే వాటిపై చర్యలు తీసుకు వాలని కోరారు. కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్, కోకన్వీనర్ చిరంజీవి, ఉపాధ్యక్షులు వెంకటేష్, జయరాములు, వైఎస్ఆర్టీసీ సతీష్, రమేష్ లు పాల్గొన్నారు.