Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -కల్వకుర్తి
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు అన్నారు. సోమవారం పట్టణంలోని కళ్యాణ్ నగర్ కాలనీలో ఉన్న భవన నిర్మాణ కార్మిక సంఘం భవన్లో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 3న హైదరాబాదులోని కార్మిక శాఖ భవన్ ముట్టడి కార్యక్రమం ఉంటుందన్నారు.ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయా లని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపా ధ్యక్షులు ఆంజనేయులు నాయకులు యాదయ్య, దర్శన్‌రెడ్డి,ప్రభాకర్,నరేష్ కోప్పురాజు, కృష్ణ ఉన్నారు.
అచ్చంపేట రూరల్ : హమాలీల సమస్యల పరిష్కారించాలని ఆగస్టు 3న సీఐటీయూ తలపెట్టిన చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్. మల్లేష్ అన్నారు. సోమవారం అచ్చంపేట పట్టణంలోని సివిల్ సప్లరు గోదాం ఆవరణలో హమాలీలు, కూలీల సమక్షంలో సమస్యల పరి ష్కారం కోసం ఆగష్టు 3 ఛలో హైదరాబాద్ గోడ పత్రికను ఆవిష్కరించారు.కార్యక్రమంలో గోదాం హమాలీలు రాము జంగయ్య,పెద్ద జంగయ్య, చిన్న జంగయ్య, బక్కయ్య, తిరుపతయ్య ,లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
కందనూలు : అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 3న నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ జి అశోక్ పిలుపునిచ్చారు. సోమవారం భవన నిర్మాణ సంఘం కార్యాలయంలో గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పనిచేసిన కార్మికులకు కనీస భద్రత లేదన్నారు.కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు గట్టు శ్రీనివాస్, నాగనూలు శ్రీనివాస్, శేఖర్, సత్యం, బాలరాజు, ఆంజనేయులు పాల్గొన్నారు.
కందనూలు : జీవో నెంబర్ 25 ను అమలు చేయాలని, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ పబ్లిక్ ప్రైవేటు ట్రాన్స్ పోర్టు జిల్లా కన్వీనర్ పొదిల రామయ్య ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీపురం ఆటో అడ్డా చౌరస్తాలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని సంబంధించిన గోడ పత్రికను విడుదల చేశారు.ఆగస్టు 3వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కురుమూర్తి, మహేష్ శ్రీను, లక్ష్మయ్య, బాబు, మహేష్, గోపాల్, అంజీ, శివ, రాములు ఆనంద,్ రాము, శ్రీశైలం, శేఖర్, బాలు తదితరులు పాల్గొన్నారు.
కొత్తకోట : ఈ నెల 3న చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయాలని సీఐటీయూ ఉపాధ్యక్షుడు నిక్సన్ కోరారు. సోమవారం కొత్తకోట మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో హమాలీ కార్మికుల గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీ కార్మికులు నిత్యం రోడ్డుపైన కూలి పనులు చేస్తూ జీవిస్తుంటారని గుర్తుచేశారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్సు పథకాన్ని అమలు చేస,ి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయి ంచాలని తెలిపారు. సమావేశంలో బాలస్వామి, తిరుపతయ్య, చంద్రన్న, శాంతన్న, కథలయ్య, సంతోష్, కచేరి నాగన్న తదితరులు పాల్గొన్నారు.