Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వనపర్తిరూరల్:వనపర్తి జిల్లాలోని సోషల్ వెల్ఫేర్ గురుషకుల బాలిక,బాలుర గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అంద చేయాలని ఎస్సీ,ఎస్టీ వనపర్తి జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు గంధం నాగరాజు దళిత బహుజన జెఎసీ రాష్ట్ర కన్వీనర్ గంధం సుమన్ కాటేపాక హుస్సేన్ కొమ్ము రాములు మాదిగ డిమాండ్ చేశారు. సోమ వారం నూతన పేరెంట్స్ కమిటీలను తక్షణం ఏర్పాటు చేసి ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత బహుజన నాయకులు జిల్లా కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగడానికి నీరు లేక విద్యుత్ సౌకర్యం లేక గురుకుల విద్యార్థులకు ప్రతి రోజు స్నానం చేయడానికి ,బట్టలు శుభ్రం చేసుకోవడానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే వనపర్తి జిల్లాలోని సోషల్ వెల్ఫేర్ బాలుర,బాలికల గురుకులలో పేరెంట్స్ నూతన కమిటీని ఏర్పాటు చేసి 15 రోజులకు ఒకసారి పేరెంట్స్ మీటింగ్ నిర్వహించే ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ను కోరామన్నారు.ఈ నెల 10వ తేదీలోగా అన్ని గ్రూపులలో పేరెంట్స్ నూతన కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులతో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రం భగవంతు, ఎమ్మార్పీ ఎస్ తెలంగాణ జాతీయ ఉపాధ్యక్షులు ద్యారపోగు నారాయణ పాల్గొన్నారు.