Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కందనూలు
మోడీ విధానాలతో ప్రమాదంలో ప్రజాస్వామ్యమని సీపీఐ జిల్లా కార్యదర్శి బాల్ నరసింహ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం లోని సీపీఐ కార్యాలయంలో సోమవారం సీపీఐ సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ అనుసరిస్తున్న విధానాల తో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని బిజెపి పాలకులు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా నాయకులు ఆనంద్ జీ వార్ల వెంకటయ్య ఫయాజ్ కేశవులు గౌడ్ టి. నరసింహ కొమ్ము భరత్ కోళ్ల యేసయ్య ,శివ, కష్ణ, తుమ్మల శివుడు కురుమయ్య పాల్గొన్నారు.