Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ధరూర్
వరద బాధితులకు ఇండ్ల స్థలాలు చూపిం చాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ .వెంకటస్వామి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ శ్రీ హర్ష కు వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ అలంపూర్ వరద బాదితులకు ఇండ్ల పట్టాలు ఇచ్చి 13 సంవత్సరాలు గడుస్తున్న నేటికీ స్థలాలు ఇవ్వలేదన్నారు. వరదల్లో అలంపూర్ ప్రజలు సర్వం కోల్పోయి అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. అన్నారు.ప్రభుత్వం 43 ఎకరాలు కొని వరద బాధితులకు 812 పట్టాలు ఇచ్చిన వారికి స్థలాలు పంపిణీ చేయాలని ఇవ్వని వారికి ఇంకా ప్రక్కనే 20 ఎకరాల భూమి కొనుగోలు చేసి వెంటనే వారికి కూడా పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించాలని కలెక్టర్ దష్టికి తీసుకు పోవడం జరిగిందన్నారు. కలెక్టర్ కొంత సమయం పడుతుందని చేప్పారని తెలిపారు. వరద బాధితులకు కేటాయించిన ప్లాట్లలో ఇప్పటికే రైతు వేదిక నిర్మాణం చేశారని, ఇంకా సమీకత మార్కేట్ యార్డు నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు.అటువంటి స్థలాలు బాధితులకు ఇవ్వని ఎడల వరద బాధితులను సమీకరించి ఇచ్చిన వరద స్థలాల్లో సీపీఐ(ఎం) పార్టీగానే బాధితులకు స్థలాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా నాయకులు రేపల్లె దేవదాసు, జి.రాజు, ఇదాన్నా, మద్దిలేటి,సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి బి.నరసింహ,నాయకులు అయ్యప్ప, పుల్లన్న, వరద బాధితులు నగలచమ్మ, పద్మ, వెంకటలక్ష్మి, చాముండేశ్వరి, రవి, బాషా, రమిజా, గోకారి, తదితరులు పాల్గొన్నారు.