Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- అలంపూర్
అలంపూర్ పట్టణంలో పూలే అంబేద్కర్ సర్కిల్‌ను ఏర్పాటు చేయాలని బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జి బి.మహేష్, ఉపాధ్యక్షులు యామని సుంకన్నలు డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలో పూలే అంబేద్కర్ సర్కిల్ ఏర్పాటు పట్ల సంతకాల సేకరణ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్లు విస్తీర్ణంలో భాగంగా మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే, భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, విగ్రహాలను వెనుకకు నెట్టాలని మున్సిపాలిటీ కౌన్సిలర్లు చేసిన తీర్మానంను ఉపసంహరించుకోవాలని తెలిపారు. ఫూలే, అంబేద్కర్ సర్కిల్ ను ఏర్పాటు చేయాలని, లేనియెడల బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ మండల అధ్యక్షులు నాగరాజు, సెక్టర్ అధ్యక్షులు మద్దిలేటి పాల్గొన్నారు.