Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేరేడు పండు అంటే తెలియని వారు ఉండరు. ఈ పండుగను పిల్లలు. పెద్దలు అందరూ అమితంగా ఇష్టపడతారు. నేరేడు పండును వేసవి కాపు పండుగ చెబుతారు. ఇందులో మనకు తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
- నేరేడు పండుతో 'ఆరోగ్యం'
- పండులో పోషకాలెన్నో...
- షుగర్ వ్యాధిగ్రస్తుల పాలిట గొప్ప వరం..
- హిమోగ్లోబిన్ శాతం పెరుగుదల..
- ఆస్తమా,దంతా సమస్యలకు దూరం..
నవతెలంగాణ కందనూలు
మధుమేహంతో పాటు అనేక శారీరక సమస్యలను నేరేడు పండు దూరం చేస్తుంది. నేరేడు పండు నేరేడు ఆకులు నేరేడు చెట్టు బెరడు కూడా అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంతో సహాయపడుతుంది. నేరేడు పండు పొటాషియం,సోడియం, క్యాల్షియం, ఫాస్ఫరస్, మాంగనీస్, జింక్, విటమిన్ ఏ .సీ తో పాటు రైజో ప్లానింగ్. పోలిక్ యాసిడ్ ను సమద్ధిగా కలిగి ఉంటుంది. నేరేడు పండు షుగర్ వ్యాధిగ్రస్తుల పాలిట గొప్ప వరమని డాక్టర్లు చేప్పారు. మధుమేహంతో బాధపడుతున్న వారు నేరేడు గింజలు పొడిని నీటిలో కలిపి తీసుకొనడం వల్ల శరీరంలోని చక్కర శాతాన్ని తగ్గించుకోవచ్చు అంతేకాకుండా ఇది అధిక రక్తపోటు సమస్యను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ కాలేయ పనితీరును మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. నేరేడు పండు రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా రక్తంలో క్యాన్సర్ కారకాల వద్ధి చెందకుండా నిరోధిస్తుంది ఇందులో ఉండే ఐరన్. విటమిన్ సి రక్తంలోని హిమోగ్లో బిన్ శాతా పెంచుతాయి. నేరేడు పండ్లను తినడం ద్వారా దంత సమస్యలను తగ్గించుకోవచ్చు ఇది దంతాలకు చిగుర్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది నోటిలో పురుగులు ఫుల్లుగా చెప్పబడే నోటి పల్సర్ ను నివారిస్తుంది దంతరక్షాన్ని తగ్గిస్తుంది. నేరేడు గింజల పొడి ముఖానికి వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటుదన్నారు. నేరేడు పండు మన జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలకు ఇది ఒక చక్కని పరిష్కారాన్ని చూపుతుంది కడుపు ఉబ్బరం, వాంతి అయ్యేలా ఉండే లక్షణాలను తగ్గిస్తుంది. మల బద్ధకంతో పాటు మూత్ర సంబంధిత సమస్యలను నివారిస్తుందని నిపుణులు తెలిపారు.
కీళ్ల నొప్పులను తొలగిస్తాయి
ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యను దూరం చేస్తుంది. అనేక చర్మవ్యాధులను చర్మంపై వచ్చే తెల్లటి మచ్చలను తగ్గించేందుకు సహాయ పడుతుంది. అంతేకాకుండా కీళ్ల నొప్పులను లివర్ సమస్యను తగ్గించడం లో దోహదపడుతుంది.
- డాక్టర్ లక్ష్మారెడ్డి
నేరేడుతో దంత సమస్యలు దూరం
నేరేడు పండ్లను తినడం ద్వారా దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇది దంతాలను,చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది.
- డాక్టర్ రాజ్ భూషణ్ ,దంత వైద్యులు