Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగణ పెంట్లవెళ్లి
మండల కేంద్రంలోని చౌట చెరు వు, పెరు మాళ్ల చెరువుల వద్ద ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి మోటా ర్ల ద్వారా నీరు చౌర్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవా లని మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూల కేశవులు, బీఎస్పీ జిల్లా కోశాధికారి బ్రహ్మ య్యలు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహీసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దామో దర్కు సోమవారం వినతిపత్రం అందజేసి మా ట్లాడారు. కొన్నేండ్లుగా ఎలాంటి అనుమతు ల్లే కుండా చెరువుల నుంచి జల చౌర్యానికి పాల్ప డుతున్నారన్నారు. మూడు కిలో మీటర్ల దూరం వరకు పైప్లైన్లు ఏర్పాటు చేసుకుని చెరువుల నీటిని తరలించు కుపోవడం వల్ల చెరువుల కింద ఉండే రైతుల పొలాలు బీళ్లుగా మారే అవ కాశం ఉందన్నారు. వీరి వెనుక అధికార పార్టీ నేతలుండడంతో వారిని ప్రశ్నించే పరిస్థితి లేద న్నారు. దీనివల్ల ఎకరా, రెండెకరాలున్న దళిత రైతులకు నీరు లేక పొలాలు ఎండిపోయే ప్రమా దాలున్నాయన్నారు. చెరువుల నుంచి నీటిని తరలించేందుకు పెద్ద పెద్ద ట్రాన్స్ ఫార్మర్లు ఎలా ఏర్పాటు చేస్తారని విద్యుత్ శాఖ అధికారు లను ప్రశ్నించారు. ఇదంతా విద్యుత్ శాఖ అధి కారుల కనుసన్నల్లోనే కొనసాగుతుందన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు పేద రైతులను దృష్టిలో ఉంచుకుని నీటి చౌర్యాన్ని నివారించాలని, లేకు ంటే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందో ళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు రాజశేఖర్, కె.వెంకటేష్, బీవీఎఫ్ శివ కుమార్, రామదాస్, విష్ణు, తేజ పాల్గొన్నారు.