Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మహబూబ్ నగర్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీలో పని చేసే కూలీలకు నష్టం చేసే ఉద్దేశంతో తీసుకు వచ్చిన ఎన్ఎంఎంఎస్ విధా నాన్ని తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ వ్యవ సాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం కలెక్టరుకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పని చేసే కూలీలలు రోజుకు మూడుసార్లు పని ప్రదేశాలలో ఫోటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేసే విధానం ఇది సరైనది కాదన్నారు. గ్రామీణ దూర ప్రాంతాలలో నెట్వర్క్ లేని గ్రామాలు అనేకం ఉన్నాయన్నారు. ఇప్పటికే మూడు నెలల బిల్లులు పెండింగ్ ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జగన్, పాండు ,శేఖర్ పాల్గొన్నారు.