Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉట్కూర్ :ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిన పోయిన మండలంలోని అమీన్ పూర్, సామానురు, పగిడిమారి, ఓబులాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే సోమవారం పర్యటిం చి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. గ్రామాలకు సంబంధించిన సమస్యలు తమ దృష్టికి రాకుండా చూడాలన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే ఉధృతంగా పారుతున్న వాగును దాటి గ్రామాల్లో పర్యటించడంపై ఆయా గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఆయా గ్రామాల్లో పర్యటించిన ఆయన గ్రామాల్లో ఎక్కడా పారిశుధ్యం లోపించకుండా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్ గౌడ్, టీఆర్ఎస్ మండల నాయకులు సుధాకర్ రెడ్డి, నారాయణరెడ్డి, జాఫర్, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.