Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా పరిష్కరించాలని మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల కలెక్టర్లు ఎస్.వెంకట్రావు, షేక్ యాస్మిన్ భాష, వనపర్తి జిల్లా ఇంచార్జి ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్, నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు అన్నారు. ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లా కేంద్రాల్లోని కలెక్టర్, ఎస్పీ కార్యాల యాల్లో సోమవారం ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అయితే మండల, తాలుకా స్థాయిలో ఫిర్యాదులు పరిష్కరిస్తే జిల్లా కేంద్రాలకు వచ్చే అవకాశం ఉండదన్నారు. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు.
- మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల కలెక్టర్లు ఎస్.వెంకట్రావు, షేక్ యాస్మిన్ భాష, వనపర్తి జిల్లా ఇంచార్జి ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్, నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు
నవతెలంగాణ -మహబూబ్నగర్
జిల్లా కేంద్రంలోని రెవెన్యూ సమావేశ మంది రంలో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు ప్రజావాణిలో ప్రజల నుంచి 117 ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో స్థా నిక సంస్థల అదన కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వనపర్తి : జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ప్రజల నుంచి 20 ఫిర్యా దులు స్వీకరిం చారు.
ఎస్పీ కార్యాలయాల్లో..
వనపర్తి రూరల్ : జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఇంచార్జి ఎస్పీ కె.రంజన్ రతన్ కుమార్ ప్రజావాణిలో ప్రజ ల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా ప్రాంతాల నుం చి 8 ఫిర్యాదులు అందాయి.
నారాయణపేట రూరల్ : జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు ప్రజల నుంచి ఫిర్యా దులు స్వీకరించారు. అందులో 6 వచ్చినట్లు ఆయన తెలిపారు.
వెల్దండ : స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారి పత్యానాయక్, తహసీల్దార్ చంద్రశేఖర్లు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మోహన్ లాల్, ఎంపీఓ లాలయ్య, ఏఓ మంజుల తదితరులు పాల్గొన్నారు.