Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పట్టాలకు 'ఎమ్మెల్యే' సాకు !?
- 17 ఏండ్లుగా పట్టాల కోసం గిరిజన రైతుల ఎదురుచూపులు
- పట్టాలొచ్చి రెండెండ్లైనా ఇవ్వని అధికారులు
- దృష్టి సారించని ఉన్నతాధికారులు
- దిక్కుతోచనిస్థితిలో గిరిజన రైతులు
దేవుడు వరమిచ్చినా..పూజారి కరుణించడంలేడనే సామెతను అధికారులు నిరూపితం చేస్తున్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు సాగు రైతులకు పట్టాలివ్వాలని ప్రభుత్వం ఆదేశిలిచ్చి పట్టాలు మంజూరు చేసినా అధికారులు మాత్రం ఎమ్మెల్యే సమయం ఇవ్వడంలేదనే సాకుతో రెండేండ్లుగా రైతులకు చుక్కలు చూపుతు న్నారు. దీంతో రైతులకు పట్టాలుండి ఇవ్వకపోవడంతో రైతుబంధు, బీమా, సబ్సిడీ వంటివి అందడంలేదు. అయితే డబ్బులివ్వక పోవడంతోనే పట్టాలివ్వడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. అలాగే అధికార పార్టీ నేతలు ఇప్పటికే కొందరి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. అందువల్ల జిల్లా ఉన్నతాధి కారులు స్పందించి వచ్చిన పట్టాలను కాలయాపన చేయకుండా వెంటనే రైతులకు అందజే యాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.
నవతెలంగాణ - అచ్చంపేట
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గంలో అటవీ హక్కుల చట్టం ప్రకారం 2006-07లో దాదాపు 228 మంది గిరిజన రైతులు పోడు సాగు భూ ములకు పట్టాలివ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకు న్నారు. 2007-08లో 168 మంది రైతులను పట్టాలకు అర్హులుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అమ్రాబాద్ మండలంలోని చెన్నంపల్లి, చిట్లం కుం ట, లక్ష్మాపూర్ గ్రామాలకు చెందిన 168 మంది గిరిజన రైతులు పట్టాల కోసం ఎదురు చూశారు. పట్టాల కోసం సంవత్సరాల తరబడి కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో రెండేండ్ల క్రితం డీటీడీఓ కార్యాలయానికి పట్టాలొచ్చాయి. కానీ అధికారులు ఎమ్మెల్యే ద్వారా పంపిణీ చేయాలని, అందుకు ఎమ్మెల్యే తమకు సమయం ఇవ్వడం లేదంటూ చెప్పుకొస్తున్నారు. కానీ రెండేండ్ల కాలంలో ఒక రోజు ఎమ్మెల్యే గిరిజన రైతుల కోసం కేటాయించలేడా ? ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి అధికార పార్టీ నేతల ప్రమే యంతో డబ్బులు వసూలు చేసిన తర్వాతనే పట్టాలు పంచాలనే నిర్ణయం తీసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నా రు. ఈ పట్టాలన్నీ డీటీడీఓ కార్యాలయంలోనే మూలుగు న్నాయని, అందులో 18 మంది రైతులకు రైతుబంధు డబ్బులు కూడా పడినట్లు ఆధారాలున్నాయి. అంటే పట్టా లివ్వకున్నా రైతుబంధు డబ్బులు ఎలా పడతాయని బాధిత రైతులు ప్రశ్నిస్తున్నారు. ఆ 18 మంది రైతుల నుంచి డబ్బు లు తీసుకుని వారికి పట్టాలిచ్చారని విమర్శించారు. ఈ తం తు అధికారుల కనుసన్నల్లోనే నడుస్తుండడంతో పట్టించు కునే నా ధుడే కరువయ్యాడని వాపోయారు. మూడు నెలల క్రితం సీఎం కేసీఆర్ పోడు సాగు రైతులకు పట్టాలిస్తామని ప్రకటన నేపథ్యంలో 11 వేల మంది గిరిజనులు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇవి నేటికీ పరిశీల నకు నోచుకోవడంలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాధిత రైతులకు వెంటనే పట్టాలివ్వాలని గిరిజన సంఘం నాయకులు, బాధిత రైతులు కోరుతున్నారు.
ఏడాది నుంచి తిరుగుతున్నాను
నేను మూడెకరాల భూమి సాగు చేసుకుంటున్నాను. హక్కు పత్రాల కోసం ఏడాది నుంచి డీటీడీఓ కార్యాలయం చుట్టూ తిరు గుతున్నాను. అయినా అధికారులు కనికరించడం లేదు. ఎప్పడిస్తా రోనని ఎదురు చూస్తున్నాం. పట్టాలిస్తే ప్రభుత్వం అందించే సబ్సి డీ ఎరువులు, ఇతర పథకాలు వర్తిస్తాయని ఎదురు చూస్తున్నాం.
- లక్ష్మణ్, గిరిజన రైతు, లక్ష్మాపూర్
పట్టాలిస్తామని పిలిచి ఇవ్వలేదు
పట్టాలిస్తామని జూన్ నెల 4న మన్ననూరులోని డీటీడీఓ కార్యాలయానికి పిలిపించారు. లబ్ధిదారులతో పాటు గిరిజన సంఘం నాయ కులతో అక్కడి వెళ్లాము. కానీ అధికారులు రాలేదని చెప్పి హక్కు పత్రాల్వికుండా వెనక్కి పంపారు. అంటే గిరిజన సంఘం నాయకులు రాకుండా ఉండి ఉంటే ఏమైనా డబ్బులు అడిగేవారేమోనని అనుమా నమొస్తోంది.
- సొని, మహిళా రైతు లక్ష్మాపూర్
కావాలనే డీటీడీఓ ఇవ్బడంలేదు
2005- 2006లో దరఖాస్తు చేసుకున్న 168 మంది రైతులకు హక్కు పత్రాలు డీటీడీఓ కావాలనే ఇవ్వడంలేదు. రాజకీయ నాయ కుల మాటలతో ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు.
- శంకర్ నాయక్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి
ఎమ్మెల్యే సమయం కోసం చూస్తున్నాం : అశోక్, డీటీడీఓ
168 మంది రైతులకు పట్టాలొచ్చాయి. త్వరలో ఎమ్మెల్యే చేతుల మీదుగా హక్కు పత్రాలు పంపిణీ చేయడానికి ప్రయత్నం చేస్తు న్నాము. కొత్తగా చేసుకున్న దరఖాస్తులు ఇంకా పరిశీలన చేయలేదు. ఎమ్మెల్యే సమయం ఇవ్వగానే పంపిణీ చేస్తాం.