Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శిధిలావస్థలో ఆర్డీఎస్ కార్యాలయం
- భయం మాటున అధికారుల విధులు
- దృష్టి సారించని అధికారులు
- ఆందోళనలో ప్రాజెక్టు సిబ్బంది
నవతెలంగాణ - ఉండవెల్లి
సార్..నన్ను గుర్తు పట్టారా..! నేను రాజోళి బండ మళ్లింపు పథకం ( ఆర్డీఎస్) పథక నిర్మాణం కోసం మండల కేంద్రానికి సమీపంలో ఎ-బూడిద పా డులో ఏర్పాటు చేసిన ఆర్డీఎస్ కార్యాలయాల భవనా లం. ఏఈ లు, డీఈలు, లష్కర్లు, సిబ్బంది కోసం నిర్మిత మైన ఆరు భవనాలము. మమ్మల్ని స్వాతంత్య్రానంతంర 1950లో అంటే మమ్మల్ని నిర్మించి దాదాపు 72 ఏండ్లైం ది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా బాబోగులు మర చి ఎంచక్కా పట్టణాలు, నగరాలు, వ్యవసాయ పంట పొలాలు, చెట్ల కింద సేదతీరుతున్నారు. ఒక ప్పుడు మా గదుల్లో ఫ్యాన్లు వేసుకుని ప్రశాంతంగా విధులు నిర్వహి ంచేవారు. కానీ నేడు మేము శిధిలావస్థకు చేరి కూలేం దుకు సిద్ధంగా ఉన్నాము. మమ్మల్ని చూసి ఎప్పుడు కూలుతామోనని భయపడుతున్నారు తప్ప మమ్మల్ని బాగు చేయాలనే ఆలోచన లేదు. వస్తారు..పోతారు. మేమెలాగున్నామో కూడా చూడరు. మీ కోసం వేతనా లు పెంచాలని, కమీషన్లు పెంచాలని డిమాండ్ చేస్తారు. ప్రతి రోజు రంగు రంగుల దుస్తులతో తయారై వస్తారు. శిధిలావస్థకు చేరిన మమ్మల్ని బాగు చేసి కొత్త గా కన్పించేలా రంగులు వేయాలనుకోరు. ఎం దుకంటే మేము మీరు అలసిపోతే సేదతీర్చే వస్తువులం కదా.. అందుకే పట్టించుకోరు. ఏ అధికారైన మమ్మల్ని బాగు చేయకుండా పో తారా అని మాలో మేమే కుమిలిపోతూ కన్నీ రు కార్చని రోజంటూ లేదు. అయినా మీలో ఎలాం టి మార్పు రావడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఎటూ పట్టించుకోలేదు. కనీసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వా తైన పట్టించుకున్నారా ? అంటే అదీ లేదు. ఇప్పుడు మేమేమో గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాము. ఇప్పుడున్న అధికారులు, సిబ్బంది భయం మాటున విధులు నిర్వహిస్తున్నారు తప్ప ప్రేమతో కాదు. మా పరిధిలో 7 ఎకరాల విస్తీర్ణం ఉంది. అది నేడు రోజురోజుకూ క్రమంగా ఆక్రమణకు గురౌతోంది. ఇప్పటికే పల్లె ప్రకృతి వనానికి కొంత స్థలం తీసుకోగా, చుట్టు పక్కల రైతులు తమను అందిన కాడికి ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారు. అలసిపోయిన చేతుల్లా రక్షణ గోడలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల మమ్మల్ని బాగు చేయాలని, లేకుంటే మా స్థానంలో నూతన భవనాలు నిర్మించి సిబ్బంది ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని పాలకులు, అధికారులను కోరుతున్నాయి.