Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ధరూర్
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వరప్రదా యిని అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగు తుండగా గేట్లు మూసేసి విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. ఎగువన నారాయణపూర్ నుంచి 20 వేల క్యూసెక్కులు, ఆల్మట్టి నుంచి 18 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో జూరాలకు 49,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రా జెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీ ఎంసీలు కాగా ప్రస్తుతం 4.177 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 43,732 క్యూసెక్కుల నీటిని ఉపయో గించి 6 యూనిట్లో 234 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. యథావిధిగా జూరాల నుంచి నెట్టెంపాడుకు 1500 క్యూసె క్కులు, భీమా-1కు 0, భీమా-2కు 750 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1060 క్యూ సెక్కులు, కుడి కాల్వకు 508 క్యూసె క్కులు, కోయిల్‌సాగర్‌కు-0 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 1310 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మొత్తంమీద దిగువ ప్రాంతానికి 48,177 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.