Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గద్వాల జిల్లా కలెక్టర్ శ్రీహర్ష
నవతెలంగాణ - ధరూర్
వివిధ కారణాలతో చదువుకు దూరమై చదు వుకోని వారికి ఓపెన్ స్కూల్ ఒక వరం లాంటిదని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమా వేశ భవనంలో ఓపెన్ స్కూల్కు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ సోమ వారం ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో పది, ఇంట ర్ చదువుకునే విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ స్కూల్ ద్వారా విద్యావంతులు కావచ్చన్నారు. చదువు మ ధ్యలో మానేసిన వారిని గుర్తించి ఓపెన్ స్కూల్లో చేర్పించి పరీక్షలు రాసేలా వారిని ప్రోత్సహించాలన్నారు. ఆగస్టు 14వ తేది వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, అక్టోబర్ 10వ తేది వరకు అపరాధ రుసుముతో ఓపెన్ స్కూల్లో ప్రవేశాలు పొందవచ్చని తెలియజేశారు. కార్యక్రమ ంలో జిల్లా విద్యాధికారి సిరాజుద్దీన్, అసిస్టెంట్ కమిష నర్ శ్రీని వాసులు, డీసీఈబీ ప్రతాపరెడ్డి, కో-ఆర్డినేటర్ వెంక టేశ్వర్ రావు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.