Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ పి.ఉదరుకుమార్
- రోగులను గుర్తించి వైద్య సేవలందించాలి
నవతెలంగాణ - కందనూలు
క్యాన్సర్, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వద్ధులకు 'ఆలన'తో సంచార వైద్య సేవలందించేం దుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అందులో భాగంగా ఒక వాహనాన్ని ఏర్పాటు చేసిందని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ఉదరుకుమార్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆలన వాహనాన్ని కలెక్ట ర్ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఇంటిపట్టునే ఉంటున్న వయో వద్ధులకు జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు ఆలన వాహనాలను అందుబాటు లోకి తెచ్చామన్నారు. వాహనంలో డాక్టర్తో పాటు ఏఎన్ఎం, సిబ్బంది ఉంటారన్నారు. ప్రతి గ్రామం లో పక్షవాతం వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధప డుతున్న వారిని గుర్తించి జిల్లా ఆస్ప త్రికి తరలిస్తా మన్నారు. జిల్లాలో ఇప్పటివరకు గుర్తించిన 72 మ ంది క్యాన్సర్తో బాధపడుతున్న వారికి ఆలన ద్వారా చికిత్స అందిస్తు న్నామన్నారు. ఆలన సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి దీర్ఘకాలిక, పక్షవాతంతో బాధ పడుతున్న వద్ధులను గుర్తించి చికిత్స అందించాల ని సూచించారు. అంతకుముందు 167 మంది వీ ఆర్ఓలకు డ్రిప్ ద్వారా ఆయా శాఖల కేటాయింపు లు చేశారు. కార్యక్ర మంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్ నాయక్, మనుచౌదరి, జిల్లా వైద్యాధికా రి సుధాకర్ లాల్, ఆలన మెడికల్ అధికారిణి శ్రీవా ణి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కృష్ణమోహన్, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్, మలేరియా ప్రోగ్రాం ఆఫీసర్ ఆర్.శీను, రేణయ్య, కలెక్టర్ కార్యాలయ ఏఓ శ్రీని వాస్ తదితరుల పాల్గొన్నారు.