Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తాడూరు
మండల సర్వసభ్య సమావేశనికి అధికారులు హాజరు కాకపోవడంతో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తాడూ ర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ శ్రీదేవి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానికి మండల స్థాయి అధి కారులు హజరుకాకపోవడంతో కొంత అహహనం వక్త్యం చేశారు. మండల సమావేశానికి హాజరు కాని అధికారుల వివరాలను జిల్లా కలెక్టర్‌కు అంద జేసి వారిపై చర్య తీసుకోవాలని ఎంపిడిఓకు సూచించారు. వచ్చే సమావేశానికి అధికారులంతా తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ మన ఊరు - మన బడి, అభివద్ది కార్యక్రమాలకు ఇసుక కొరత వుందని సభ దష్టికి దేవడంతో ఎమ్మెల్యే ఇసుక కొరత లేకుండా చూడాలని తహసీల్దార్‌కు సూ చించారు. సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. అన్ని శాఖల మండల అదికారులు అందరూ ప్రభుత్వం చేపట్టిన ప్రతీ సంక్షేమ కార్యక్ర మాన్ని ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు, వర్షాకాలం వున్నందున రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులను వాయిదా వేయడం జరిగిం దని త్వరలో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో భూ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. వచ్చే నెలలో అర్హు లందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు అందలజే యడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యుత్ శాఖపై మాట్లాడుతూ వర్షా కాలం సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా చూసు కోవాలని గ్రామాల్లో అక్కడక్కడ ఇనుప స్తంభాలు ఉన్నచోట సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేసే విధం గా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికా రులకు సూచించారు విద్యుత్ స్తంభాల కొరతయున్న ఉన్నట్టయితే తన దష్టికి తీసుకురావా లని ఆ విద్యుత్ అధికారులను కోరారు, రైతుబంధు రైతు బీమా పథకాల్లో భాగంగా కొత్తగా పట్టాదారు పాస్ బుక్కులు తీసుకున్న రైతులందరికీ రైతుబంధు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అదికారులకు సూచించారు. రైతులకు విత్తనాలు , ఎరు వులు కొరత లేకుండా చూసుకోవాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. సర్పంచులందరూ చోరువ తీసుకుని గ్రామాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచేలా చూసుకోవాలని సూచించారు, హరితాహరం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా నాటుతున్న మొక్కలను సంరక్షించాలని వాటికి ట్రీగార్డ్స్ ఏర్పాటు చేసి పశువుల నుండి సం రక్షించాలని కోరారు. సూచించారు. గ్రామాల్లో ఉపాధి కూలీలకు వంద రోజులు పనులు కల్పిం చాలని సంబంధిత అధికారులకు ఆదేశిం చారు. కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీ టీసీలు , ఎంపీపీ జడ్పిటిసి, పిఎసిఎస్, చైర్మన్ రైతుబంధు అధ్యక్షులు పాల్గొన్నారు.