Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హామీలు అమలు చేయడంలో కేసీఆర్ విఫలం చెందారు. .అసెంబ్లీలో ప్రకటించిన పేస్కేలు జీవోను వెంటనే విడుదల చేయాలని వీఆర్ఏల సమ్మెకు దిగారు.ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.
నవతెలంగాణ- పెద్దకొత్తపల్లి
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు కొనసాగుతున్న వీఆర్ఏల తొమ్మిదవ రోజుకు చేరుకుంది. తొమ్మిదో రోజు వీఆర్ఏల సమ్మెకు మద్దతుగా జిల్లా సీఐటీయూ సహాయ కార్యదర్శి డి ఈశ్వర్ , జిల్లా నాయకులు దశరథం గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అశోకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమ ంలో వీఆర్ఏలు, మండల వీఆర్ఏల జేఏసీ చైర్మన్ మల్లేష్ నాయుడు, కోచైర్మన్ రాములు, ప్రధాన కార్యదర్శి ప్రసన్న, కన్వీనర్ బంగారయ్య, శివతేజ తదితరులు పాల్గొన్నారు.
బల్మూరు : వీఆర్ఏ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న నిరసన దీక్షలు బుధవారంకు తొమ్మిది రోజులకు చేరుకున్నది.
మరికల్ : మండలంలో వీఆర్ఏలు తొమ్మిదవ రోజుకు చేరిన నిరవధిక సమ్మెలో ఆమ్ఆద్మీ పార్టీ నారాయణపేట కోఆర్డీనేట్ ప్రజా ప్రతినిధి రాజు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఆమ్ఆద్మీ పార్టీ మండల సమన్వయకర్త మైముద్ ,వీఆర్ఏ జేఏసీ నాయ కుడు హనుమంతు లక్ష్మన్న , కురుమన్న తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తి : ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ నెరవేర్చకపోతే గడ్డంతో వీఆర్ఏలు సమ్మెబాట పట్టారు. కల్వకుర్తి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి తొమ్మిదో రోజుకు చేరుకున్నారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు దీక్షా శిబిరానికి చేరుకొని వీఆర్ఏలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్యక్ర మంలో సర్పంచ్ల సంఘం నాయకులు పాండు గౌడ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సి ఆంజనేయులు సీపిఎం సీనియర్ నాయకులు ఏపీ మల్లయ్య, సీపీఐ(ఎం) జిల్లా నాయ కులు ఆంజనేయులు, రిటైర్డ్ ఆర్మీ గోవర్ధన్ రెడ్డి ఉన్నారు.
వంగూరు :వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తానమాట ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని నాగర్కర్నూల్ డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకష్ణ అన్నారు. 9వ రోజుకు చేరుకున్న వీఆర్ఏల రిలే నిరాహార దీక్షకు మద్దతుగా మంగళవారం తాహసీల్దార్ కార్యాలయం సందర్శించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బండ్లపల్లి బాలస్వామి,కాంగ్రెస్ మండల అధ్యక్షులు పండిత్ రావు, సర్పంచ్ మల్లయ్య,ఎంపీటీసీ రమేష్ గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, యాదగిరి రావు, విష్ణు ,రమేష్ ,రఫీ, జనార్ధన్, తిరుమలేష్ ,చంద్రయ్య ,తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు : మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు గత ఎనిమిది రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష 9వ రోజుకు చేరింది. మంగళవారం తెలంగాణ వ్యవసాయ సంఘం జిల్లా అధ్యక్షులు అజరు, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పి .శ్రీహరి మద్దతు తెలిపారు.కార్యక్రమంలో మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షులు గోవిందు, మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగటన,పరుశురాం ,నయుం శ్రీరాములు, కురుమన్న, రాధమ్మ లక్ష్మి, పాల్గొన్నారు.
అచ్చంపేట రూరల్ : రాష్ట్ర వీఆర్ఏ జేఏసి పిలుపు మేరకు అచ్చంపేట మండలం తహశీల్దార్ కార్యాలయం ముందు సమ్మె చేశారు. మంగళవారం అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయానికి వొచ్చే వారికి ఛారు ఇచ్చి వీఆర్ఏలు నిరసన తెలిపారు. కార్యక్రమంలో అచ్చంపేట వీఆర్ఏలు, అచ్చంపేట వీఆర్ఏ జేఏసీ చైర్మన్ పరమేష్,కో చైర్మన్ శోభారాణి, వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి సాజిత్, ప్రచార కార్యదర్శి రాంగోపాల్, శాంతయ్య, కోశాధికారి నిరంజన్, సభ్యులు రాములు,చిట్టయ్య ,నిరంజన్ తవిటి ఆంజనేయులు, వెంకటేష్, చాంద్ బి, హనుమంతు, మహేష్, శ్రీను ,కవిత, ఉమా, అనిత ,అంజి తదితరులు పాల్గొన్నారు.
ఉట్కూర్ : ప్రభుత్వం వెంటనే స్పందించి వీఆర్ఏ సంస్థలు పరిష్కరించాలని టీఆర్ఎస్ నాయకులు రాజప్ప కౌసర్ తిరుపతి తదితరులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రమైన ఊట్కూర్ లోని తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలకు ఉచితంగాటీని అందజేశారు.కార్యక్రమంలో వీఆర్ఏలు పాల్గొన్నారు
గట్టు : మండలం 9వ రోజు వీఆర్ఏ నిరవధిక సమ్మెకుకాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. కార్యాక్రమంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బలిగేరా నారాయణ రెడ్డి, పార్టీ నాయకులు, గద్వాల వీరబాబు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట స్వామి, మండల అధ్యక్షులు గౌస్ , ఎంపీటీసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కొత్తకోట :కొత్తకోట తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏ లు రాష్ట్ర కమిటీ పిలు మేరకు నిరవధిక సమ్మెను కొనసా గిస్తున్నారు. మంగళవారం కొత్తకోటలో వీఆర్ఏలు వినూత్న రీతిలో టీ తయారు చేసి వచ్చిపోయే వారికి ఇచ్చారు. కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు వెంకట్రాములు, బాలకృష్ణ, శ్రీను, రాము, బాలయ్య,అలివేల,శిరీష, అనిత, బాలకష్ణ, విజయకుమారి, బాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
తెలకపల్లి : వీఆర్ఏల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నాగర్ కర్నూలు జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని నిరవధిక సమ్మెకు చేరుకొని వీఆర్ఏలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ ఎం బాలాగౌడ్ ,ఎంపీటీసీ ఈశ్వరయ్య, నిరంజన్ , కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వీఆర్ఏల జిల్లా జాక్ చైర్మన్విజరు మండల జాక్ చైర్మన్ ,కె అశోక్ కోచైర్మన్ ఇబ్రహీం, సెక్రటరీ జనరల్ రాము, కో కన్వీనర్లు బాలమ్మ, సాయి, సైదులు, సుల్తాన్, పాల్గొన్నారు
బిజినాపల్లి : బిజినాపల్లి మండలంలో ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా చేపట్టిన వీఆర్ఏ నిరసన కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా నాయకులు ఆర్ శ్రీనివాస్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో వీఆర్ఏ జిల్లా అధ్యక్షులు విజరు ఖాజా, అశోక్ మండల వీఆర్ఏ సంఘం అధ్యక్షులు సలేశ్వరం, ఉపాధ్యక్షులు హుస్సేన్, కార్యదర్శి ఆంజనేయులు, శేఖర్, సాయి, తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్ : వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని గత వారం రోజుల నుంచి శాంతియుతంగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల నియోజకవర్గం సమన్వయకర్త అనిరుద్ రెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మంగళవారం మండల కేంద్రంలోని తాహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల దీక్షకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపారు.కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గౌస్ రబ్బాని, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అల్వాల్ రెడ్డి,ఎంపీపీ కాంతమ్మ బాలస్వామి, ఎంపీటీసీ గౌస్, నరసింహ, సర్పంచులు జంగయ్య, జంగయ్య, నాయకులు సంపత్ కుమార్ మల్లికార్జున్రెడ్డి ,శంకర్ నాయక్, మల్లేష్, బంగారు, శివ,వీఆర్ఏలు, బాలస్వామి, కర్ణకర్, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు
అమరచింత : అమరచింత మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం కొత్త రూపం దాల్చింది. ఇది వినూత్నంగా చీపుర్లతో రోడ్లను శుభ్రం చేశారు. కార్యక్రమంలో జేసీ వీఆర్ఏ మండల కమిటీ అధ్యక్షులు మహమూద్, ఉపాధ్యక్షులు మునిస్వామి, శీను , నారాయణ, రాజు, గోవర్ధన్ ,అర్జున్ పలువురు పాల్గొన్నారు.
బాలానగర్ : వీఆర్ఏలు తమ సమస్యల పరిష్కారం కోసం గత ఏడు రోజుల నుంచి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ధర్నా యధావిధిగా కొనసాగుతుంది. మంగళవారం జడ్చర్ల నియోజకవర్గం సంయుక్త కర్త జనంపల్లి అనిరుద్ రెడ్డి మద్దతు తెలిపారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుఆది,రమణారెడ్డి,వెంకట్ నాయక్,యాదయ్య పాల్గొన్నారు
ఊరుకొండ : కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. మంగళవారం ఊరుకొండ మండల వీఆర్ఏలు సత్తయ్య, రమేష్, శేఖర్, నిరంజన్, శ్రీలత, యాదమ్మ, సుల్తాన్, యాదయ్య, దశరతం, తదితరులు తొమ్మిదవ రోజు నిరవధిక సమ్మె చేపట్టారు. వీఆర్ఏల సమ్మెకు జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జనంపల్లి అనిరుద్ రెడ్డి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఊరుకొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీఆర్ఏలు సత్తయ్య, రమేష్, శేఖర్, నిరంజన్, శ్రీలత, యాదమ్మ, సుల్తాన్, యాదయ్య, దశరతం, తదితరులు పాల్గొన్నారు.
శ్రీరంగాపూర్ : మండల కేంద్రంలో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేస్తున్న ధర్నా లో బహుజన సమాజ్ పార్టీ మండల కమిటీ హాజరై మద్దతు తెలిపారు. కార్యక్ర మంలో బహుజన సమాజ్ పార్టీ వనపర్తి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ రమేష్,పార్టీ సీనియర్ నాయకులు ఆర్పిబీసన్న,వనపర్తి నియోజ కవర్గం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రంగాపురం మండల ఎంపిటీసి గూడెం ఎల్లస్వామి, మండల పార్టీ కన్వీనర్ శ్రీ నివాస్, కో కన్వీనర్ ధర్మ, వార్డు మెంబర్ చంద్ర శేఖర్, మండలపార్టీ సోషల్ మీడియా కన్వీనర్ విష్ణు, శ్రీ రంగాపురం సెక్టార్ అద్యక్షులు తాటిపాముల గందం స్వామి,కార్యదర్శి కురుమయ్య, భాస్కర్ పాల్గొన్నారు.
ధరూర్ : రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు తహసీల్దార్ గద్వాల ఆవరణలో ముందు టీ అమ్ముంటూ అతిథులకు తహసీల్దార్ వారి సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మురళికి కోటేష్ , గ్రామ రెవెన్యూ సహాయకుల ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షులు బి రాములు, జిల్లా జేఏసీ కో కన్వీనర్ లు వెంకటేశ్వర్లు, కావాలి మహేష్, చంద్రమ్మ, గద్వాల మండల ప్రధాన కార్యదర్శి కావాలి గోవర్ధన్, వీఆర్ఏలు నరసింహులు దేవమ్మ మొగిలి,వీరన్న, బేరి రంగన్న, రాముడు వెంకటేష్ సుధాకర్ పాల్గొన్నారు.
ధన్వాడ :వీఆర్ఏల సమ్మె 9వ రోజు చేరుకున్న సమ్మెకు జిల్లా నాయకులు సీఐటీయూ డి కృష్ణ మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వీఆర్ఏ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరారు.
పెంట్ల వెళ్లి : మండలం కేంద్రంలో వీఆర్ఏల సమ్మె తొమ్మిదివ రోజు కు చేరుకుంది. కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు స్వాములు,వీఆర్ఏలు వెంకటేశ్వర్లు, కోటేశ్వరమ్మ ,వెంకటస్వామి, అలివేలమ్మ ,వెంకటమ్మ పాల్గొన్నారు.
తిమ్మాజిపేట : వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి వీఆర్ఏలు వినతి పత్రం అందజేశారు. తిమ్మాజిపేటలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట తొమ్మిది రోజులుగా తమ సమస్యల సాధన కోసం వీఆర్ఏలు నిరాహార రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వీఆర్ఏల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్ర మంలో దామోదర్, రామచందర్, నవనీత, రాజు, ఉదరు కుమార్, ఆయా గ్రామాల వీఆర్ఏలు పాల్గొన్నారు.
మాగనూర్: మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద రాష్ట్ర వీఆర్ఏల జేఏసీ పిలుపు మేరకు మంగళవారం మాగనూర్ మండలం వీఆర్ఏలు 9వరోజు నిరవధిక సమ్మె చేశారు. కార్యక్రమంలో వీఆర్ఏలు పాల్గొన్నారు.