Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కందనూలు
భారతదేశ సాంస్కతిక వారసత్వానికి ప్రధానమైన చిహ్నాలలో చేనేత రంగం ఒకటని, చేనేత వారసత్వాన్ని కాపాడుకొనుటకు, కార్మికులను శక్తివంతం చేయడం కొరకు భావితరం విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా మంగళవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్లో చేనేత శాఖ ఇంచార్జి ఏడీ గోవిందయ్య,బీసీ సంక్షేమ శాఖ జిలా అధికారి అనిల్ ప్రకాష్,ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ,జిల్లా సైన్స్ అధికారి కృషారెడ్డితో కలిసి ఏర్పాట్లపై చర్చించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్క రించు కొని భావి తరాలైన విద్యార్థులకు అవ గాహన కల్పించే విధంగా జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న 8, 9,10వ తరగతి విద్యార్థులు, ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు వ్యాసరచన, ఉప న్యాస పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. 6న ఈ పోటీలు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నాగర్ కర్నూల్ నందు నిర్వహించాలని అధికారులకు అదేశించారు. ఆగస్టు 7న పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులచే ర్యాలీ నిర్వహించా లన్నారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ నుంచి గాంధీ విగ్రహం వరకు ఉండేవిధంగా చూడాలన్నారు.అనంతరం గెలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమోంటోలు ఇచ్చేవిధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థులకు ,పాఠశాల ఉపాధ్యాయులకు ఏమైనా సందేహాలుంటే జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనిల్ కుమార్ (8008099442),జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి (9989921105)ని సంప్రదించాలని ఆయన కోరారు.