Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -కందనూలు
న్యాయవాది మల్లారెడ్డి హత్యను నిరసిస్తూ నాగర్ కర్నూలు జిల్లా న్యాయవాదులు కోర్టు వాదు లు బహిష్కరించారు. ఆగస్టు 1 న ములుగు -వరంగల్ ప్రధాన రహదారి పై వరంగల్ జిల్లా న్యాయవాది మల్లారెడ్డి ని కిరాతకంగా దాడి చేసి చంపిన ఘటన నునిరసిస్తూ, నాగర్ కర్నూల్ జిల్లా న్యాయ వాదులు కోర్టు విధులను బహిష్కరించా మన్నారు. అనంతరం సంతాపం ప్రకటించి మృతి చెందిన న్యాయ వాది కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను భూతి ప్రకటించారు. అనంతరం జిల్లా న్యాయ వాదులు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, ముఖ్యమంత్రి దష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు. శ్రీనివాస్ గుప్తా, న్యాయ వాదులు పర్వత్ రెడ్డి, శ్యామ్ ప్రసాదరావు,హర్షవర్ధన్ రావు,జనార్దన్ రెడ్డి, బంగారయ్య గౌడ్,శ్రీనివాస్ గౌడ్,రాంలక్ష్మయ్య, ప్రతాప్ రాయ్, జీవన్, స్వామి నాథ్, కృష్ణ, శంకర్, తిరుపతయ్య, రామకృష్ణ, శాంత్తయ్య, పాల్గొన్నారు.
మల్దకల్ :ములుగు జిల్లా న్యాయవాది మల్లారెడ్డిని కొందరు దుండగులు హత్య చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ గద్వాల బార్ అసోస ియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కోర్టు ఎదుట విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు శోభారాణి, ప్రధాన కార్యదర్శి మధుసూదన్ బాబు, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి న్యాయవాదులు రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.