Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదిలో మూడుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించాలి
- నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదరు కుమార్
నవతెలంగాణ- కందనూలు
జిల్లాలోని ప్రతి విద్యార్థి ఆరోగ్య వివరాలు నమోదు చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి.ఉదయ్‌కుమార్ ఆర్బిఎస్కె అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాల యం లో రాష్ట్రీయ బాలల స్వస్థ కార్యక్రమం (ఆర్బిఎస్కె) పనితీరు 2022-23లో చేపట్టవలసిన ప్రణాళికపై సంబంధిత డాక్టర్లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్లు పాఠశా లలను సందర్శిస్తూ ప్రతి విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి, ఆరోగ్య స్థితిగతులు సమగ్ర వివరాలతో నమోదు చేయాలన్నారు. అంగన్వాడీల లోని విద్యా ర్థి ఎత్తు, బరువు, ఎనీమియా వంటివే గాక చర్మ, దంతాలను పరీక్షిస్తూ అవసరమైన విద్యార్థులకు మందులు పంపిణీ చేస్తూ విద్యార్థి కేషీట్ లో నమోదు చేయాలన్నారు. మండలంలోని భవిత కేం ద్రాల ఐఆర్పీలతో సమన్వయం చేసుకొని, వైకల్యాలు కలిగిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల న్నారు. తాను కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించి ఆకస్మికంగా పాఠశాలలను సందర్శిస్తానని, విద్యా ర్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటా నన్నారు. ఆయా పాఠశాలల్లో ప్రతి నెలా విద్యా ర్థుల ఆరోగ్య లోపాలు, ఎత్తు, బరువు, వినికిడి వంటి వాటిని పరిశీలించి ప్రథమ చికిత్సలు చేయాల న్నారు. అదే విధంగా పాఠశాలకు సమీపంలో ఉండే ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఒక రోజు పాఠ శాలకు వెళ్లి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిం చాలన్నారు. అనారోగ్యంతో చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులకు తగు సూచనలిచ్చి, విద్యార్థులు ఆరోగ్యకరంగా వుండేలా చేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, అంటు వ్యాధుల నియంత్రణ, వ్యాధి నిరోధక శక్తి, పోషకా హారం, తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహ న కల్పించాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఏడాదికి మూడుసార్లు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయాలన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో పనిచేస్తున్న 10 బందాల సభ్యులు నిర్వర్తించిన వైద్య పరీక్షల వివరాలపై ప్రతినెల మొదటి శుక్రవారం సమీక్ష నిర్వహిస్తానన్నారు. సమీక్ష సమావేశంలో ఇంచార్జ్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి, ఆర్బీఎ స్కే జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ రవి నాయక్, జిల్లా హెల్త్ కోఆర్డినేటర్ రేణయ్య,ఆర్బిఎస్కే జిల్లా కోఆర్డినేటర్ విజయ్, ఆర్ బి ఎస్ కె డాక్టర్లు మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.