Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- అచ్చంపేట
ప్రయివేటు పాఠశాలలలో ఫీజుల దోపిడీని అపాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వర్ధం సైదులు అన్నారు. మంగళవారం పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో డీవైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయివేటు పాఠశాలలలో డ్రెస్సులు, టై బెల్టు , పుస్తకాల పేరుతో అధిక ఫీజులు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పట్టణంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలు యాజమానుకు విద్యాహక్కు చట్టం అమలు చేయడంలో పూర్తిగ నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాలలో పుస్తకాలు అమ్మకూడదని నిబంధనను తుంగలో తొక్కుతున్నారని వారు మండి పడ్డారు.పట్టణంలో ప్రైవేట్ స్కూల్లో ఒక్క విద్యార్థి దగ్గర నుంచి సంవత్సరానికి రూ. 50 -70 నుంచి వేల వరకు కట్టించుకుంటున్నారని వారు ఆరోపించారు.విద్య హక్కు చట్టం ప్రకారం 25శాతం ప్రయివేట్ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థులకి ఉచిత విద్యను అందించాలని నిబంధనలు ఉన్న అమలు చేయకపోవడం లేదన్నారు. విద్యాధికారులు పర్యవేక్షణ చేయకుంటే భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ఆధ్వర్యంలో అధికారుల కార్యాలయాలను పెద్ద ఎత్తున ముట్టడిస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు మహేష్, రవి, సుల్తాన్, శంకర్, రేణయ్య ఉన్నారు.