Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేలకు వేలు వసూలు
- రేకుల షెడ్లు, చెట్లకింద చదువులు
- పుస్తకాలు, కోచింగ్‌లకు అదనం
- దండుకుంటున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు
- పట్టించుకోని అధికారులు
- నిండా మునుగుతున్న తల్లిదండ్రులు
ఫీజులు బారెడు.. వసతులు జానెడులా.. ఉంది కొన్ని ప్రైవేటు పాఠశాలల తీరు. తల్లిదండ్రుల నుంచి వేలు వేలు వసూలు చేస్తున్న యాజమాన్యాలు ఇరుకు గదులు, రేకుల షెడ్లు, చెట్ల కింద పాఠశాలలను కొన సాగిస్తుండడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నా రు. అధిక ఫీజులకు తోడు పుస్తకాలు, టై, బెల్టులు, డ్రెస్సు లు తమ వద్దే కొనాలనే నిబంధనలు విధిస్తూ
తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారు.
నవతెలంగాణ-అయిజ
అయిజ పట్టణంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తు న్నారు. తమ వద్ద వేల వేల ఫీజులు వసూలు పాఠశా లలను ఇరుకు గదులు, రేకుల షెడ్లలో కొనసాగించడంతో తమ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని గీతాంజలి, అక్షర, ఆదర్శ, హై స్కూల్ రేకుల షెడ్లలో కొనసాగుతున్నాయంటున్నారు. ఆయా పాఠశాలల్లో పదో తరగతి ఫీజు రూ. 22 వేలకు పైగా వసూలు చేస్తుండగా నర్సరీకి రూ.7వేల నుంచి 10వేలు, ఎల్కేజీ రూ. 8 నుంచి 11 వేలు, ఇలా తరగతిని బట్టి రూ.1 వేయి నుంచి 2 వేల పెంచుతూ ఫీజు వసూలు చేస్తుండగా పుస్తకాలు, టై, బెల్టులు తమ వద్దే కొనాలని, స్కూల్ యూనిఫాం తాము సూచించిన షాపులోనే కొనాలనే నిబంధనలతో నిలువు దోపిడీ చేస్తున్నారని తల్లి దండ్రులు వాపోతున్నారు. కరోనా టైంలో ఆన్లైన్ క్లాసు ఫీజులు వసూలు చేసిన యాజమాన్యాలు ప్రస్తుతం కరోనా నష్టమంటూ వేలకు వేలు వసూలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఆదర్శస్కూల్లో నవోదయ, గురుకుల కోచింగ్ పేరుతో అధనంగా రూ.35 వేలు వసూలు చేస్తు న్నారంటున్నారు. కొందరు అమాయక తల్లిదండ్రులు మాపిల్లలకు మంచి ర్యాంక్ సాధించేలా చూడండంటూ కొంత అధికంగానే చెల్లిస్తున్నారనే సమాచారం.
ఆయా పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలు ప్రకారం తరగతి గదులు, ఆటస్థలాలు లేక పోయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లి దండ్రు వాపోతున్నారు. ఇప్పట్టికైనా అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్దంగా కొనసాగుతున్న పాఠశాలలపై చర్య తీసుకోవాలని వారు కోరుతున్నారు.