Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వంగూరు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని వారిని గద్దె దించాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వార్ల వెంకటయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్ పిలుపునిచ్చారు.మంగళవారం వంగూరు చారగొండ మండల కేంద్రంలో ఒక ప్రయివేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన 16వ మండల మహాసభలలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న మోడీ సర్కార్ నల్లధనాన్ని వెలికితీత, అవినీతి నిర్మూలన, అచ్చే దిన్, ధరలు నియంత్రణ, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు రకరకాల కల్లబొల్లి కబుర్లు చెప్పి నేడు వందల మెక్కిన తర్వాత 8 సంవత్సరాల కాలంలో అడ్డగోలుగా అన్ని రకాల ధరలుపించి ప్రజల నడ్డి విరిచింది అన్నారు. గతంలో ఏనాడూ లేని రీతిలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్, వంట నూనె నిత్యవసర ధరలు భారీ స్థాయిలో పెంచిందన్నారు. అచ్చే దిన్ కాదు చచ్చే దీన్ ప్రజలకు వచ్చాయని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఎల్ఐసి, బ్యాంకింగ్, టెలికం, విమానయానం, రైల్వే అన్నిటిని విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులకు కారు చౌకగా కట్టబెడుతుందని విమర్శించారు. దేశాన్ని లూటీ చేసి బ్యాంకులను దోచుకెళ్లిన 29 మంది బడా పెట్టుబడిదారి దొంగలను పాస్‌పోర్టులు వీసాలు ఇచ్చి విమానాలు ఎక్కించి విదేశాలకు సాగనంపిన చరిత్ర మోడీ సర్కారుదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలుచేయడం లేదు అన్నారు. ఈనెల 24 ,25న నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిర్వహించే సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలన్నారు. ఈ మహాసభలలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సహాయ కార్యదర్శి పల్ల వెంకట్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ చారగొండ మండల కార్యదర్శి ,జిల్లా కౌన్సిల్ సభ్యులు డాక్టర్ సిహెచ్ శ్రీనివాసులు, కల్వకుర్తి మండల కార్యదర్శి పులిజాల పరుశురాం, వంగూరు మండల కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, సీనియర్ నాయకులు మద్ది నారాయణరెడ్డి, జల్ల బాలయ్య, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు ఏ సారం అశోక్, నాయకులు మొగిళ్లశ్రీనివాస్, భూత్పూర్ శంకరయ్య, తోట నాగేందర్, రేణుక, కార్మిక సంఘం నాయకులు చంద్రయ్య, సైదులు, ఆటో యూనియన్ నాయకులుశ్రీను తదితరులు పాల్గొన్నారు.