Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వనపర్తి
దేశంలో,రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి ఎ.లక్ష్మి అన్నారు. సాయి నగర్ కాలనీ, టీచర్స్ కాలనీలలో ఐద్వా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సంతకాల సేకరణ చేశారు.ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కార్యదర్శి ఏ లక్ష్మి మాట్లాడుతూ దేశ ప్రజలు కరోనా నుండి కోలుకోక ముందే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యవసర వస్తువులు, వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం మేమేమీ తక్కువ కాదన్నట్లు బస్సు, విద్యుత్ చార్జీలు పెంచి రాష్ట్ర ప్రజల పైన భారం వేసిందన్నారు.కేంద్ర ప్రభుత్వం నిత్యం వస్తువులు పెరుగుదల చాలాదన్నట్లు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడేది పోయి కార్పొరేట్ వాళ్లకు కారు చౌకగా అమ్మేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకపక్క ప్రజలపై భారాలు పెంచి మరోపక్క కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. రాబోయే కాలంలో ధరలను అదుపు చేయకుంటే ఐద్వ సంఘం ఆధ్వర్యంలో ప్రజలను, మహిళలను కూడగట్టి ప్రభుత్వ కార్యాలయం ఎదుట ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యురాలు సాయిలీల, చంద్రకళ ,కాలనీ వాసులు పాల్గొన్నారు.