Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ అశోక్
కందనూలు: నాగర్‌కర్నూల్ జిల్లా లేబర్‌శాఖ అధికారిపై చర్య తీసుకోవాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ జి.అశోక్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కార్మికశాఖాధికారి కార్యాలయంలో ఉండడం లేదని, ఫీల్డ్‌లో ఉంటున్నానని చెప్పి ఉద్యోగం కూడా సక్రమంగా చేయడం లేదని ఆరోపించారు. కార్మికులు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సంవత్సరం క్రితం దరఖాస్తు చేసుకున్నా ఇప్పట్టి వరకు రాలేదని, కొత్తవారు లేబర్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నా ఇవ్వడం లేదన్నారు. ఎవరైనా కార్యాలయానికి పోతే తిడుతూ బయటకు వెళ్లగొడు తున్నారన్నారు. లేబర్ అధికారి ఎప్పుడు చూసి నా జూనియర్ అసిస్టెంట్, ఇతర సిబ్బంది కూడాఉండడం లేదన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సత్యనారాయణ, ఆంజనేయులు, విష్ణు పాల్గొన్నారు.