Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్ రషీద్
నవతెలంగాణ-నారాయణపేట టౌన్
జిల్లాలో ఈ నెల 13న నిర్వహించనున్న లోక్‌అదాలత్‌ను విజయవం తం చేయాలని పేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రషీద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కోర్టులో పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులతో నిర్వహించిన లోక్ అదాలత్ మొదటి సన్నాహక సమా వేశంలో న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులను రాజీ చేసేందుకు కషి చేయాలన్నారు. లోక్ అదాలత్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ సత్యనారా యణ, ఎక్సైజ్ , పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు.