Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులు ప్రలోభాలకు గురి కావద్దు
- జిల్లా అదనపు ఎస్పీ రామేశ్వర్
నవతెలంగాణ - కందనూలు
మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా అదనపు ఎస్పీ రామే శ్వర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కిషన్ మి నీ ఫంక్షన్ హాలులో శ్రామిక వికాస కేంద్రం, కై స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. అక్రమ రవాణాకు గురైన వారితో బలవం తపు శారీరక శ్రమ, అవయవ అక్రమ రవాణా, మత్తు పదార్థాల విక్రయం, వ్యభిచార గహాలకు తరలించడం, ప్రమాదకర పరిశ్రమల్లో పని చేయించడం వంటివి చేయి స్తుంటారన్నారు. అందులో అనాధలు, ఇంటి నుంచి పారి పోయిన, తప్పిపోయిన పిల్లలు, కిశోర బాలికలు, ప్రేమ పెళ్లి ద్వారా మోసపోయే పిల్లలు, వీధి బాలలు, అనాధ పిల్లలు, లైంగిక వేధింపులకు గురయ్యే కుటుంబాల పిల్లల ను లక్ష్యంగా చేసుకుని తరలిస్తుంటారని గుర్తు చేశారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఇలాంటి వాటికి పాల్పడుతున్న ట్లు తెలిస్తే 1098, డయల్ 100, 181 నెంబర్లకు సమాచారమివ్వాలని సూచించారు. కార్యక్రమంలో షీ టీం ఎఎస్ఐ విజయలక్ష్మి, డీసీపీఓ నిరంజన్, సఖి నిర్వా హకురాలు సునీత, చైల్డ్‌లైన్ అరుణ, సీడబ్ల్యూసీ మెంబర్ విష్ణు, ఎస్వీకే ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ తిరుపాల్, మండల కో-ఆర్డినేటర్లు శ్రీనివాసులు, విజయమ్మ, మహేష్, లలిత, రేణుక తదితరులు పాల్గొన్నారు.