Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలంపూర్ : వరద ముంపునకు గురైన బాధి తులను ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా నా యకులు రేపల్లె దేవదాస్ డిమాండ్ చేశారు. బాధితులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం చేరుకుని అధికారులకు పరిస్థితిని వివరించా రు. అధికారులు నాసీరకంగా కల్వర్టులు నిర్మి ంచడంతో వర్షపు నీరు ఇండ్లలోకి చేరి సరుకు లన్నీ తడిసిపోయాయన్నారు. అందువల్ల అధికారులు ప్రతి కుటుంబానికి రూ.20 వేలతో పాటు 20 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేయాలని కోరా రు. అయితే ముంపునకు గురైన అక్బర్ పేటను సందర్శించి నష్టపోయిన కుటుంబాల వివరాలను సేకరించి ఉన్నతా ధికారుల దష్టికి తీసుకెళ్లి, బాధిత కుటుం బాలకు న్యాయం చేకూరేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సుభాష్ నాయుడు, మున్సిపల్ కమిషనర్ నిత్యానం ద్లు భరోసానిచ్చారు. అనంతరం అధికారులు ముంపు ప్రాంతంలో పర్య టించారు.