Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలంపూర్ : పట్టణంలో ముంపునకు గురైన అక్బర్ పేట కాలనీ బాధితులకు అన్ని విధా లుగా అండగా ఉంటామని మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ వెంకటేష్ అన్నారు. కమి షనర్ నిత్యా నందతో కలిసి ఆమె కాలనీని సందర్శించారు. మోకాళ్ల లోతు నీటిలో నడు చుకుంటూ ప్రజల ఇబ్బందులను గమనించారు. మోటార్ల సాయంతో కాలనీలోని వరద నీటిని తోడిపోయించా రు. నూతనంగా నిర్మించిన కల్వర్టును జేసీబీతో తొలగించి వరద నీరు కందకంలోకి వెళ్లేలా చర్యలు చేపట్టారు. అలాగే కేజీబీవీ, పాపనాసి ఆలయం దగ్గర మిషన్ భగీరథ పైప్ లైన్ వరద లో కొట్టుకుపోయిందని, వెంటనే మరమ్మతు చేయాలని అధికారులకు సూచించారు. పరిస్థితిని ఎమ్మెల్యే దష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా చూస్తామని హామిచ్చారు. ఈమె వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి, కౌన్సిలర్ సుష్మా, ఏఈ రాజశేఖర్, అధికారులు నారాయణ, షరీఫ్, శానిటేషన్ ఇన్స్ స్పెక్టర్ సామేలు తదితరులున్నారు.