Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిమ్మాజీపేట : దళితుల స్వయం ఉపాధికి దళితబంధు బంధువులాంటిదని, ప్రభుత్వం అందించే ఈ సహాయాన్ని సద్విని యోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన దానం జంగ య్యకు దళితబంధు కింద మంజూరైన నిధు లతో ఏర్పాటు చేసిన బ్లెస్సీ గార్మెంట్స్ (బట్టల దుకాణాన్ని) ఎమ్మెల్యే మంగళ వారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి మాట్లాడారు. దళిత కుటుంబాలు పేదరికం నుంచి బయటపడి స్వశక్తితో ఎదగా లనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా లబ్ధిదారులు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న యూనిట్లను ఏర్పాటు చేసుకుం టే విజయవంతంగా లాభాలు సాధింవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీంద్రనాథ్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మం డలాధ్యక్షులు ప్రదీప్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షులు వేణుగోపాల్ గౌడ్, కో- ఆప్షన్ సభ్యులు అబ్దుల్ రజాక్, సర్పంచులు సత్యం యాదవ్, ఉమాదేవి, మార్కెట్ డైరెక్టర్లు ఉశేని, కవిత, నాయకులు స్వామి, శ్రీరాములు, నాగేందర్ గౌడ్, కిల్లె మల్లయ్య, బలస్వామి, చెన్నయ్య, మోహనాచారి, ఇబ్రహీం పాల్గొన్నారు.