Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కల్వకుర్తి టౌన్
గతంలో పలు నేరాలకు పాల్పడి జైలు జీవితం గడిపి కోర్టు చుట్టూ తిరుగుతున్న పాత నేరస్తుల లో సత్ప్రవర్తన వస్తే వారిపై ఉన్న కేసులను పరిశీలించి ఎత్తివేస్తామని నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ మనోహర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని పార్థసారథి ఫంక్షన్ హాల్లో ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాత నేరస్తుల తో జిల్లా ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో నేరాలకు పాల్పడ్డ వారిలో మార్పు గుర్తించి వారికి సంబంధించిన రౌడీషీట్లు గాని తదితర కేసులు ఎత్తివేయాలని తెలిపారు. అక్కడికొచ్చిన పాత నేరస్తుల లో మార్పు గమనిస్తారని వారిలో మార్పు కనిపిస్తే కేసులు ఎత్తివేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. సమావేశంలో కల్వకుర్తి డీఎస్పీ గిరి కుమార్ సీఐ సైదులు, వెల్దండ సీఐ రామకష్ణ,కల్వకుర్తి ఎస్ఐ మహేందర్ ,తదితరులు పాల్గొన్నారు.