Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -మహబూబ్ నగర్
మహబూబ్నగర్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఓబేద్దుల కొత్వాల్ అన్నారు. మంగళవారం మహబూబ్నగర్ పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు ,పెట్రోల్, డీజిల్ ఇతర ధరలకు వ్యతిరేకంగా ఈనెల తొమ్మిదవ తేదీ నుండి 15వ తేదీ వరకు 75 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రశేఖర్ మొదటిసారిగా జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా ఆయనకు సన్మానించారు.కార్యక్రమంలో నాయకులు సత్తూరు చంద్రశేఖర్గౌడ్సంజీవ్ ముదిరాజ్, నర్సింహారెడ్డి, లక్ష్మణ్యాదవ్, సిరాజ్కాద్రి తదితరులు పాల్గొన్నారు.