Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గద్వాల జిల్లాలో భారీ వర్షం
- తెగిన కాల్వలు, నీట మునిగిన పంటలు
- కుంటలను తలపిస్తున్న కాలనీలు
- అలంపూర్, అయిజలో సహాయక చర్యలు చేపట్టిన మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ వెంకటేష్, చైర్మన్ చిన్న దేవన్న
- అయిజలో పంటలు పరిశీలించిన జేడీఏ
గద్వాల జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లగా కాల్వలు తెగిపోయాయి. పంటలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లోని లోతట్టు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదను తలపించేలా కాలనీలు దర్శనమిచ్చారు. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ క్రమంలో అలంపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ వెంకటేష్ జలమయమైన కాల నీల్లో పర్యటించి పరిస్థితులపై ఆరా తీశారు. అలాగే మోటార్ల ద్వారా నీటిని తరలించే చర్యలు చేపట్టారు. అయితే వరదల నుంచి అలంపూర్‌ను రక్షించడంలో పాలకులు విఫలమయ్యారని, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ సీపీఐ (ఎం), సీపీఐ, బీఎస్పీ నాయకులు ప్రధాన రహదారిపై భైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళన కార్యరులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అదే క్రమంలో బాధితులు పార్టీ నాయకులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం చేరుకుని విషయాన్ని వెల్లడించి ఆదుకోవాలని కోరారు.
నవతెలంగాణ - అలంపూర్ / ఉండవెల్లి / అయిజ
గద్వాల జిల్లాలోని అలంపూర్, అయిజ, ఉండ వెల్లి, మానవపాడు, ఇటిక్యాల మండలాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షాలకు ఆ ప్రాంతాలు అతలాకుతలమ య్యాయి. వర్షం కారణంగా అలంపూర్ పట్టణంలోని అక్బర్ పేట మరోసారి ముంపునకు గురైంది. కాలనీలోని వీధులనీ జలమయమయ్యాయి. దీంతో ఆయా కాలనీవాసులు నిద్ర పోయేందుకు కూడా వీలు లేకపోయింది. ప్రధాన రోడ్లపై మోకాళ్ల లోతుకు పైగా నీరు పారడంతో బయటికెళ్లేందుకు భయాందోళన చెందారు. అయితే వరదల నివారణలో పా లకులు, అధికారులు విఫలమయ్యారని, ఎమ్మెల్యే డౌన్ డౌ న్ అంటూ సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బి.నరసింహా, బీఎస్పీ నాయకులు కేశవులు, తాలుకా కార్యదర్శి బి.మహే ష్, యామిని సుంకన్న, సీపీఐ తాలుకా కార్యదర్శి పెదబా బులు ప్రధాన రహదారిపై భైఠాయించి నిర సన తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించి సాయంత్రం విడుదల చేశారు. అలాగే ఉండవెల్లి, మానవపాడు మండలాల్లోని పలు ప్రాం తాల్లో కురిసిన వర్షాలకు పంటలు నీట మునిగాయి. ఉం డవెల్లి మండలంలోని మిన్నిపాగు గ్రామంలో రామ్‌రెడ్డి అనే వ్యక్తి ఇండ్లు కూలిపోయింది. అయిజ మండలంలోని ఉత్తనూర్, సంకపురం, ఎక్లాస్పురం, దేవబండ, బింగిదొడ్డి తదితర గ్రామాల్లో నీట మునిగిన పంటలను జిల్లా వ్యవసా యాధికారి గోవింద్ నాయక్ ఏడీఏ సక్రియ నాయక్, ఏఓ శంకర్‌లాల్, మాజీ సింగిల్ విండో చైర్మన్ రాముడు, ఏఈఓ లోకరాజు, పవన్‌కుమార్‌లతో కలిసి పరిశీలించారు. నీరు చేరిన పొలాల్లో వెంటనే నీటిని తొలగించి మొక్కల మొదళ్ల వద్ద కాపర్ ఆక్సి క్లోరైడ్ 2 గ్రాములు లీటరు నీటిలో కలిపి పోసి పై పాటుగా 19:19:19 స్ప్రే చేసుకుంటే ఫలితం ఉంటుందని తెలిపారు. పట్టణంలోని కమతంపేట, మేకల పేట, ధుర్గానగర్, మది ్దగుంత, గాజులపేట ప్రాంతాల్లో మున్సిపల్ చైర్మన్ చిన్న దేవన్న పర్యటించారు. నీరు నిల్వ ఉండకుండా జేసీబీ సాయంతో కాల్వల్లోకి నీరు వెళ్లేలా సహాయక చర్యలు చేపట్టారు. ఈయన వెంట అసిస్టెంట్ ఇంజనీర్ గోపాల్, టీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, వెంకటేష్, ఉప్పరి చందు, ఇంచార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ వీరే ందర్, లైన్మెన్ నర్సింహులు తదితరులున్నారు.