Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వనపర్తి రూరల్
వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అవరణలొ మంగళవారం భారత స్వాతంత్ర సమరయోధుడు భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 146 వ జయంతిని టీజేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా వాగ్గేయకారులు రాజారామ్ ప్రకాష్ మాట్లాడుతూ పింగళి వెంకయ్య, స్వాతంత్య్ర సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త. అతను 1916లో భారత దేశానికి ఒక జాతీయ పతాకం అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించారని తెలిపారు.అదేవిధంగా వజ్రపు తల్లి రాయి అనే గ్రంథాన్ని రాశారన్నారు. ప్రపంచ దేశాల జెండాల కంటే ఎంతో అద్భుతంగా జెండాను తయారు చేసిన పింగళి వెంకయ్య తెలుగువాడు కావడం గర్వించదగ్గ విషయమన్నారు.1906 నుంచి 1921 వరకు జాతీయ జెండాను రూపొందించాలని మహాత్మా గాంధీ సూచన మేరకు వెంకయ్య జాతీయ జెండాను తయారు చేయాలనుకున్నాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో కవి పండితుడు భూ రోజు గిరిరాజ చారి, డాక్టర్ నాయకంటి నరసింహ శర్మ, కవి గాయకుడు విభూది ఈశ్వర్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తగవుల వెంకటస్వామి బోయ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు కావలి బాలస్వామి నాయుడు, రజక సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు బండలయ్య, విశ్వబ్రాహ్మణ సంఘం వనపర్తి జిల్లా నాయకుడు భాస్కరాచారి, రెడ్డి సేవా సంఘం నాయకుడు రవీందర్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.