Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పుల ఊబిలో గ్రామ పంచాయతీలు
- ఆపరేటర్ నుంచి అధికారుల వరకు అలవెన్సులు
- తడిసి మోపెడౌతున్న నిర్వహణ భారం
- ప్రత్యేక గ్రాంట్లు లేక అవస్థలు
- దిక్కుతోచని స్థితిలో ఆయా గ్రామాల సర్పంచులు
- దృష్టి సారించని పాలకులు
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలన్న మహాత్ముడి మాటలకు కాలం చెల్లేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. పల్లెలపై భారాలు మోపుతూ సర్పంచులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. ఇది వరకు గ్రామ కార్మికులకు వేతనాలు, పారిశుధ్య నివారణలో భాగంగా ట్రాక్టర్లకు డీజిల్, కార్మికులకు అలవెన్సులు, ఇతర ఖర్చులు భరించేలా ఆదేశాలిచ్చాయి. అంతటితో సంతృప్తి చెందని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈఓఆర్డీలకు రవాణ ఖర్చులు గ్రామ పంచాయతీలే భరించాలని ఆదేశాలివ్వడంతో ఆయా గ్రామాల సర్పం చులు సందిగ్ధంలో పడ్డారు. వచ్చే అరకొర నిధులతో గ్రామాలను నెట్టుకొస్తుంటే మళ్లీ ఈఓఆర్డీలకు అలవెన్సులు ఇవ్వాలని చెప్పడంపై డైలమాలో పడ్డారు. జీపీలకు నిధులు మంజూరు చేయకుండా ఇలా ఇష్టానుసారంగా భారాలు మోపడం ఏంటని పలువురు సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 74 మం డలాలు, 1676 గ్రామ పంచాయతీలున్నాయి. 45 లక్షల జనాభా ఉంది. ప్రతి వెయ్యి మందికి నిర్వహణ ఖర్చు కో సం ప్రభుత్వాలు 15వ ఆర్థిక సంఘం నిధులు, ఎస్ఎఫ్సీ నిధులు విడుదల చేస్తున్నాయి. ఇచ్చే నిధులు కూడా అరకొ రగా ఇవ్వడంతో నిర్వహణ భారంగా మారింది. రైతు వేది కలు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డుల నిర్మాణాలు చేసి న సర్పంచులు బిల్లులు రాక అప్పుల ఊబిలో కూరుకు పో యారు. కొందరు సర్పంచులు అప్పులు తీర్చేందుకు, ఉపా ధి కోసం పట్టణాలు, నగరాలకు వెళ్లారు. గతం కంటే నయాపైసా కూడా నిధులు పెంచలేదు. ఒక గ్రామంలో 1000 మందికి లక్షన్నర ఇస్తున్నారు. అందులో పారిశుధ్యం, వీదిలైట్లు, కంపచెట్ల తొలగింపు, ఆరోగ్య పనులు, పం చాయతి నిర్వహణ తదితర పనులు చేయాల్సి ఉంది. నూ తన పంచాయతీలు ఏర్పడిన తర్వాత వాటి నిర్వహణ భా రం నాలుగింతలు పెరిగింది. గతంలో వచ్చే నిధులతో చేసే అభివృద్దికి తోడుగా అధిక భారం మోపుతున్నారు. ట్రాక్టర్ నిర్వహణకు అయ్యే ఖర్చుతో పాటు డీజిల్, డ్రైవర్ బత్తా, పంచాయతి సిబ్బ ందికి వేతనాలు ఇవ్వడం వంటివి జీపీ నిధులతోనే ఇచ్చేవారు. నేడు ఇవి కాదన్నట్లు తాజాగా ఈఓఆర్డీలకు డీఏతో పాటు నిర్వహణ ఖర్చులు కూడా పం చాయతీలే భరించాలని ఉత్తర్వులు జారీ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అందువల్ల ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజా సంఘా ల నాయకులు కోరుతున్నారు.
ఈ భారాలు మోయలేం
సర్పంచ్ అయిన తర్వాత ఒత్తడి పెరిగింది. ఆర్థిక భారాలు అధికమయ్యాయి. రైతువేదిక, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డుల పేరుతో అనేక ఒత్తడి చేశారు. నిర్మా ణాలు ఆలస్యమైతే సస్పెన్షన్ చేస్తున్నారు. ఒత్తడి తట్టుకోలేక ప్రయివేటు అప్పులు తెచ్చి ఇబ్బందులు పడుతున్నాం. దీనికి తోడు పంచాయతి నిర్వహణ భారం పెరిగి ంది. ఈఓఆర్డీకి టీఏ, డీఏలు, ట్రాక్టర్ల నిర్వహణ, వీధి దీపాలు తదితర ఖర్చులు పెరిగాయి. ఈ భారాలు తట్టుకోలేకపోతున్నాం. వీటికోసం ప్రభుత్వం ప్రత్యేక గ్రాం టు విడుదల చేయాలి.
- దేశ్యానాయక్,
నర్సాయిపల్లి గ్రామ సర్పంచ్, బల్మూరు మండలం