Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ధరూర్
గద్వాల పట్టణంలో కృష్ణవేణి తదితర చౌరస్తా లలో బుధవారం గద్వాల ట్రాఫిక్ ఎస్సై విజరు భాస్కర్ తన సిబ్బందితో కలిసి నెంబర్ ప్లేటు లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భం గా నెంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలు, ఎక్కువ గా చలన్ పెండింగ్ ఉన్న వాహనాలను గుర్తించి జరిమానా కట్టించినట్లు ఎస్ఐ తెలిపారు. అనం తరం ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు రవాణా శాఖ ఉత్తర్వుల మేరకు తమ వాహనాలకు నెంబర్ ప్లేట్ బిగించుకోవాలన్నారు. తరచుగా నెంబరు ప్లేట్ లేని వాహనాల చోదకులు వేగంగా నడుపుతూ తోటి వాహదారులను, పాదాచారులను, భయబ్రాంతులకు గురిచేస్తున్నందున నంబరు ప్లేట్లులేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిం చామని తెలిపారు. వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, వాహన దారులు అజాగ్రత్తగా, అతి వేగంగా వాహనాలు నడుపు తునందున్న ప్రమాదం జరిగే అవకాశం ఉందని, మోటార్ సైకిల్ పై ముగ్గు రు ప్రయాణించ వద్దని, వాహనం నడిపే ప్రతి వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ వాహ నానికి సంబంధించిన డాక్యు మెంట్స్ వెంబడి ఉంచుకోవాలని సూచించారు. రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడ పాలని సూచించారు. నెంబర్ సరిగ్గా లేని వాహనాల పై కొంతమంది నేరస్తులు బండ్లపైన వచ్చి దొంగతనాలు చేయడం, మరియు చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపుతే కఠిన చర్యలు తప్పవని ఎస్సై విజరు భాస్కర్ వాహనదారులను హెచ్చరించారు. తరచుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది బలరాం, జీ మోహన్, కృష్ణ నాయుడు తదితరులు పాల్గొన్నారు.