Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్
నవతెలంగాణ - ఊరుకొండ
అధికార పార్టీని అడ్డం పెట్టుకొని అక్రమంగా భూకబ్జాలకు పాల్పడితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాధితుల తరఫున పోరాటం చేస్తానని జడ్చర్ల మాజీ శాసనసభ్యులు ఎర్ర శేఖర్ హెచ్చరించారు. బుధ వారం ఊర్కొండ మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా టిఆర్ఎస్ నాయకుల అవినీతి కంపు కొడుతున్నదని, భూకబ్జాలకు పాల్పడుతున్న టిఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అడ్డుకుంటామని, పేదల పక్షాన పోరాడుతామని అన్నారు. పేదల భూములు లాక్కుని వెంచర్లు చేయడం మానుకోవాలని టి ఆర్ఎస్ నాయకులకు హితవు పలికారు. భూ కబ్జాలకు పాల్పడేవారికి రాబోయే రోజుల్లో చట్టప రంగా చర్యలు తీసుకునేవిధంగా ఉన్నతాధికా రులను కలిసి వినతిపత్రాలు సమర్పిస్తామని, చర్యలు తీసుకొని యెడల ఉద్యమాలు ప్రారం భిస్తామని పేర్కొన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి మొదటిసారిగా మండలానికి రావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊర్కొండ ప్రధాన గేటు వద్ద ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలు కుతూ గేటు నుండి బైకు ర్యాలీతో వెళుతుండగా పోలీస్ స్టేషన్ వద్ద మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు డప్పులతో ఎర్రశేఖర్కు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. అక్కడి నుండి భారీ ర్యాలీగా ఉర్కొండపేట ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో నిరసన దీక్షలు చేస్తున్న విఆర్ఏ లకు సంఘీభావం ప్రకటించి ్ మాట్లాడుతూ వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏ ల నిరసన దీక్షలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ హామీలు తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. అనంతరం వంటవార్పులో పాల్గొన్నారు.
కాంగ్రెస్లో చేరికలు
మండల కేంద్రానికి చెందిన వివిధ పార్టీల నాయకులు ఎండి.షబ్బీర్, కుమ్మరి కష్ణయ్య తదితరులు ఎర్ర శేఖర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయా కార్యక్రమాల్లో మాధారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు కంఠం విజయుడు, సేవదళ్ మండల అధ్యక్షుడు గణేష్, సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదయ్య, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ అరిఫ్, కాంగ్రెస్ నాయకులు శ్యామ్ సుందర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, వెంకటయ్య గౌడ్, ఆయూబ్ పాషా, మనోహర్ రెడ్డి, రమేష్ నాయక్, గోపాల్, శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, బోయ రవి, రఫిక్, మైసయ్య, జంగా రెడ్డి, జగదీష్, రాఘవేందర్, శ్రీనివాస్, బంగారయ్య, రాధాకష్ణ, ఆదినారాయణ, వీఆర్ఏలు సత్తయ్య, రమేష్, శేఖర్, నిరంజన్, జంగయ్య, దశరథం, శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.