Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవ శరీరానికి దివ్యౌషధం
- మార్కెట్లో డిమాండ్ ఉన్న కాయ
వర్షాకాలపు పోషకాల గనిగా పేరుగాంచిన ఆ 'కాకర'కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ కాకర తెలియని వారుంటూ ఉండరు. ఎందుకంటే ఇది వర్షాకాలంలో మాత్రమే లభించే పోషకాల దివ్యౌషధం. అందుకే గ్రామీణుల నుంచి పట్టణ, నగర వాసులు ఈ కాకరను తినేందుకు ఉత్సాహం చూపుతారు. అంతటి ప్రాధాన్య తను సంతరించుకుంది. ఇవే కాక దగ్గు, జలుబు, ఇతర అలర్జీలకు ఇది మంచి ఔషధంగా పని చేస్తుంది. చూసేందుకు పట్టిగా ఉన్నా దాని ఆహారంగా తీసుకుంటే మాత్రం అనేక లాభాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఆంధ్ర, గుజరాత్, ఒడిసా, మహారాష్ట్ర ప్రజలు ఎక్కువగా వంటల్లో వాడుతారు. సాధారణ కాకరకాయతో పోలిస్తే చేదు తక్కువగా ఉంటుంది. అడవుల్లో లభించే ఆ'కాకర'ను అక్కడి సమీప గ్రామాల ప్రజలు విక్రయిస్తుంటారు. ఇంకేందుకు ఆలస్యం మనమూ తినేద్దాము..ఆరోగ్యంగా ఉందాము.
నవతెలంగాణ - అచ్చంపేట రూరల్
అడవులు, పంటపొలాల్లో ఆరుదుగా లభించే ఆ'కాకర' కా య, (బోడ, బొంత కాకర)కు మార్కెట్ పరంగా మంచి డిమాండ్ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో లభించే వీటికి హైదరాబాద్ వంటి పెద్ద పెద్ద నగ రాల్లో బాగా డిమాండ్ ఉంది. ఇది కేవలం వర్షాకాలంలో మాత్రమే లభి ంచే అవకాశం ఉండడంతో చాలా మంది వీటిని ఆహారంగా తీసుకునే ందుకు ఉత్సాహం చూపుతారు. పొట్టిగా గుండ్రంగా ముళ్ల లాంటి తోలు తో ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రా, అస్సామీ, గుజరాతీ, ఒడిసా, మహా రాష్ట్ర వంటకాలలో అధికంగా వాడతారు. కాకరకాయతో పోల్చితే చేదు తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు చేదు లేకుండా ఉంటుంది. వీటిని తర చుగా తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, ఇతర అలెర్జీలు దూరమౌతాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిలో కేలరీలు తక్కువగా ఉండడంతో పాటు పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభి స్తాయి. బోడ కాకర జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. వంద గ్రాముల ఆ కాకరలో కేవలం 17 కేలరీలు మాత్రమే లభిస్తాయి. వీటిలో ఉండే ప్రొ టిన్ల వల్ల శరీరంలో కొత్త కణాలు వద్ధి చెందుతాయి. వర్షా కాలంలో వచ్చే దురదల నుంచి కూడా కాపాడుతుంది. పక్షవాతం, వాపు, అపస్మారక స్థితి, కంటి సమస్యల విషయంలో కూడా మంచి ప్రభావం చూపుతోంది. రక్తపోటు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఇవి గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఉపయోగ పడతాయి. ఈ బోడకాకర కాయలను వర్షాకాలంలో కనీసం ఒక్క సారైన తినాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు.
మానవ దేహానికి దివ్యౌషధం
ప్రస్తుత పరిస్థితుల్లో విశ్వవ్యాప్తంగా కరోనా తన రూపాలు మార్చు కుంటూ మనషులపై ప్రభావం చూపుతోంది. ఈ సమయంలో ఇమ్యూని టీ పవర్ చాలా అవసరం. అన్ని వయసుల వారు మంచి పోషకాలుండే ఆహారాన్ని తీసుకోవాలి. మానవ దేహానికి అవసరమై న అన్ని విటమిన్లను అందించే దివ్యౌషధం ఈ ఒక్క కూరగాయ అని చెప్పవచ్చు. పైగా ఈ బోడకాకరలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, విటమి న్-ఎ, విటిమన్-బి, విటమిన్-సి, విటమిన్-కె, విటమిన్-డి, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రొటిన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఇలా చాలా పోషకాలు నిండి ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్-బి1, బి2, బి3, బి5, బి6, బి9, బి12, విటమిన్-ఎ, విటమిన్-సి, విటమి న్-డి2, 3, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, విటమిన్ హెచ్, విటమిన్-కె, కాపర్, జింక్ ఇలా అన్ని ఈ కూరగాయలో లభిస్తా యి. శరీరం ఫిట్‌గా ఉండేందుకు కావాల్సిన పోషకాలు ఈ కూరగాయలో ఉన్నాయి.
ఆహారంగా తీసుకోవడం మంచిది
సాధారణ కాకర తరహాలోనే ఆకాకర కూడా డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతుంది. బోడకాకరలో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని ఆహా రంగా తీసు కోవడం చాలా మంచిది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరి స్తుంది. ఆకాకర కాయలోని కెరోటె నాయి డ్లు కం టి సంబంధ వ్యాధులు రాకుండా కాపాడ తాయి. ఇందులోని విటమిన్-సి ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. వీటిలో సమద్ధిగా లభించే ప్లవనాయిడ్లు వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలను తగ్గిస్తాయి. మలబద్ధకం సమస్య కూడా దూరమౌతుంది. వీటిని తరచుగా తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వీటిని వండేటప్పుడు పైనున్న బొడిపెలను తీసే యకుండా వండాలి.
- కె.గోపాల్ నాయక్,
ఆయుర్వేదిక్ వైద్యాధికారి,
సిద్ధాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేందం