Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాయలసీమ లిప్టును శ్రీశైలం అంతర్బాగంలోకి తెచ్చే ప్రయత్నం
- రాష్ట్ర ముఖ్యమంత్రి ఎపీ ప్రాజెక్టులపై స్పందించాలి
- కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ : ఉమ్మడి జిల్లాకు సాగునీటి వాటా విషయంలో కొనసాగుతున్న పరిణామాలేంటి ?
సారంపల్లి : జిల్ల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేసి సాగు నీటిని అందించడంలో పాలకులు చిత్త శుద్ధి ప్రదర్శించడం లేదు. ప్రధా నంగా తెలంగాణ ప్రభుత్వం ఉదాసీన వైఖరి వల్లే ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తోంది. శ్రీశైలం అంతర్భాగం లోనే దీన్ని నిర్మించామని నమ్మబలుకుతున్నారు. దీన్ని మన సీఎం ఏమాత్రం వ్యతిరే కించడం లేదు. ప్రజలు, సాగునీటి నిపుణులు వ్యతిరేకించి న తర్వాత సీఎం స్పందించారు. ఇది తెలంగాణ ప్రభుత్వా నికి సరికాదు. బ్రీజేష్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం మనకు కృష్ణలో 150 టీఎంసీలు రావాల్సి ఉంది. నీటి వాడకం కో సం చిత్తశుద్ధితో ప్రాజెక్టులు పూర్తి చేసి నీటిని వాడుకోవాల్సి ఉంది. ఇప్పటికే రాయ లసీమ లిప్టు పనులు 80 శాతం పూర్తయ్యాయి. 3 టీఎంసీలను మాత్రమే రాయలసీమ ద్వా రా వాడకుంటామని చెబుతున్నా...అధిక స్థాయిలో నీటిని వాడే అవకాశాలున్నాయి. ఇంకా హంద్రీనీవా, ముచ్చుమర్రి, కేసీ కెనాల్, తెలుగు గంగ, పోతిరెడ్డిపాడు, గాలేరు నగరి వంటి ప్రాజెక్టులకు నీటిని తరలిస్తున్నారు. ఇంకా అనేక ప్రాజెక్టులకు కనెక్షన్ ఇచ్చారు. ఇంకా నీటిని తరలించే య త్నంలో పక్క రాష్ట్ర పాలకులున్నారు.
నవతెలంగాణ : నీటి తరలింపు విషయంలో పాలకులు ఎందుకు స్పందించడం లేదు ?
సారంపల్లి : హంద్రీనీవా, ముచ్చుమర్రి, కేసీ కెనాల్ ద్వారా 3 టీఎంసీలు వాడుతున్నారు. ఈ ప్రాజెక్టులు నీటి పంపింగ్ మొదలుపెడితే 15 రోజుల్లో శ్రీశైలం వెనుక జలాలు మొ త్తం పంపింగ్ చేస్తారు. ఇరు రాష్ట్రాల వివాదాలను పరి ష్కారం చేయకుండా కేంద్రం నాన్చు తోంది. ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నీటిని వాడితే పాలమూరు-రంగారెడ్డి, కల్వ కుర్తి ఎత్తిపోతలకు సాగునీటితో పాటు మిషన్ భగీరథకు తాగునీరు లభించదు.
నవతెలంగాణ : ప్రాజెక్టులను పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంది ?
సారంపల్లి : పాలమూరు-రంగారెడ్డిని జూరాల దగ్గర నిర్మి స్తే తక్కువ నిధులతో పనులు పూర్తయ్యేవి. జూరాల దగ్గర నిర్మిస్తే తక్కువ సమయంతో పాటు అతి తక్కువ నిధులు అంటే రూ.15 వేల కోట్లతో పూర్తయ్యేది. 250 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎగువకు మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేయడం దారుణం. ఇప్పుడు దాని అంచనా రూ.50 వేల కోట్లకు చేరింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభు త్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి సాగునీటిని అందించి రైతులకు సాగు కష్టాలు తీర్చవచ్చు.
గోదావరి, కృష్ణ నదీ జలాలను బోర్డు పరిధిలోకి తీసుకురావడం సరికాదని, ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిప్టును శ్రీశైలం అంత ర్భాగంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తోందని, దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిం చాలని, లేకుంటే నీటి వాటా విషయంలో దక్షిణ తెలంగాణకు అన్యాయం చేకూరుతుందని, ఇదే నిజమైతే భవిష్యత్లో పాలమూరు మళ్లీ వలసల జిల్లాగా మారనుందని కిసాన్ సభ జాతీయ ఉపాద్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. జిల్లా ప్రాజెక్టులపై ఆయన 'నవతెలంగాణ'తో పలు విషయాలు పంచుకున్నారు.
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి