Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి
- హైదరాబాద్కు తరలి వెళ్లిన హమాలీలు
నవతెలంగాణ - మహబూబ్ నగర్
హమాలీలకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చట్టం తీసుకురావాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల వెల్లి కురుమూర్తి డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన చలో హైదరాబాదుకు హమా లీలు భారీ సంఖ్యలో తరలి వెళ్లినట్లు ఆయన తెలిపారు. బుధ వారం బూత్పూర్ మండల కేంద్రంలో ఆయన జండా ఊపి వాహనాన్ని పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ హమాలి పని చేస్తున్న వారికి సమగ్ర చట్టం , వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, 50 సంవత్సరాల పైబడిన వారికి రూ.5000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని ,బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్లతో ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హమాలీల సేవలను గుర్తించడం లేదని వారికి చట్టం హక్కులు లేకుండా చేసి శ్రమ దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం, యాదవులు ,రాములు ,వెంకట సాయి, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
ధన్వాడ : హైదరాబాదులోని ఇందిరా పార్కు లో బుధవారం జరిగిన కార్మిక మహాధర్నాలో ధన్వాడ మండ లానికి చెందిన హమాలీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బాల్ రామ్, జిల్లా నాయకులు డి కష్ణయ్య మాట్లాడుతూ హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి హమాలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హమాలీలకు ప్రమాద బీమా సౌక ర్యం ఈఎస్ఐ పీఎఫ్ చట్టబద్ధమైన సౌకర్యం కల్పించాలని జరిగిన మహాధర్నాలో హమాలీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హమాలీలు భాను చందర్, మల్లేష్, బోయిన్పల్లి రాములు, సురేష్, ఖతలప్ప , బాలరాజు తదితరులు పాల్గొన్నారు
అమరచింత: హైదరాబాదులో సిఐటియు ఆధ్వర్యం లో జరుగు భారీ బహిరంగ సభకు అమరచింత మండల కేంద్రం నుంచి సిఐటియు నాయకులు తరలి వెళ్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్యన్ రమేష్ మాట్లాడుతూ హైదరాబాదులో జరుగుతున్న భారీ బహిరంగ సభ సుందరయ్య పార్క్ నుండి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ ప్రదర్శన అనంతరం భారీ బహిరంగ సభ ఉంటుందని ఆయన తెలిపారు. నరేంద్ర మోడీ తీసుకొచ్చిన 4 లేబర్ కోరుతూ కోర్డులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హమాలి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయా లని కనీస వేతనాల చట్టాన్ని సవరించాలని కార్మిక హక్కు లను కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర రాజధానిలో సుందరయ్య పార్క్ నుండి ఇందిరా పార్క్ వరకు భారీ ప్రదర్శన లో పెద్ద ఎత్తున సంఖ్యలో నిర్వహించి అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి .వెంకటేష్, జి డి .నరసింహ, తిరుపతి, తిరుమలేశ్ వీరితోపాటు హమాలీలు కార్మికులు తరలి వెళ్లారు.