Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అచ్చంపేట రూరల్
కేంద్రం తీసుకొచ్చిన కార్మిక చట్టాలను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్.మల్లేష్ డిమాండ్ చేశారు. బుధవారం హైదరా బాద్ ధర్నాకు వెళ్తున్న హమాలీ కార్మికులతో కలిసి మాట్లాడారు. హమాలీ కార్మికులు శ్రమ దోపిడీకి గురౌతున్నారన్నారు. గతంలో 8 గంటల పని దినాలను మోడీ ప్రభుత్వం 12 గంటలకు పెంచడం కార్మికులకున్న హ క్కులను కాలరాయడమేనన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తు న్న కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాల కోసం సీఐటీయూ అనేక పోర ాటాలు చేసిందని, కనీస వేతనాల సవరణ, ఐదు జీఓలపై రాష్ట్ర, దేశవ్యా ప్త సమ్మేలు, పాదయాత్రలు, లేబర్ కార్యాలయాల ముట్టడి లాంటి పలు పోరాటాలు చేసినా ఈ ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోలేదన్నారు. ఈ క్రమ ంలో హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద పెద్ద ఎత్తున తల పెట్టిన ధర్నాకు వెళ్తున్నట్లు చెప్పారు. ఈ ధర్నాకు అధిక సంఖ్యలో కార్మి కులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కూరగాయల మార్కెట్ హమాలీ యూనియన్ ప్రెసిడెంట్ ఇస్లావత్ రాజు, పర్వతాలు, దశరథం, రవి, అమ్రాబాద్ హమాలీలు మల్లయ్య, తిరుపత య్య, పర్వతాలు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.